Banana Leaf: అరటి ఆకును తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు విడిచి పెట్టరు..

|

Aug 13, 2024 | 3:15 PM

ఇంట్లో ఎలాంటి శుభ కార్యాలు, ఫంక్షన్లు ఉన్నా.. అరటి ఆకులు ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఇది పూర్వం. ఇప్పుడు వీటిని పెద్దగా ఎవరూ ఉపయోగించడం లేదు. అరటి ఆకులు కూడా పెద్దగా దొరకడం లేదు. ఇప్పుడు అన్నీ పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చేశాయి. కానీ అరటి ఆకులో భోజనం చేస్తే వచ్చే తృప్తే వేరు. అదొక సంతృప్తి. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల చాలా రకాల లాభాలు కూడా ఉన్నాయి. ఇంతకు చాలా సార్లు వాటి గురించి తెలుసుకున్నాం. అరటి ఆకులో భోజనం చేస్తే కాదు..

Banana Leaf: అరటి ఆకును తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు విడిచి పెట్టరు..
Banana Leaf
Follow us on

ఇంట్లో ఎలాంటి శుభ కార్యాలు, ఫంక్షన్లు ఉన్నా.. అరటి ఆకులు ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఇది పూర్వం. ఇప్పుడు వీటిని పెద్దగా ఎవరూ ఉపయోగించడం లేదు. అరటి ఆకులు కూడా పెద్దగా దొరకడం లేదు. ఇప్పుడు అన్నీ పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చేశాయి. కానీ అరటి ఆకులో భోజనం చేస్తే వచ్చే తృప్తే వేరు. అదొక సంతృప్తి. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల చాలా రకాల లాభాలు కూడా ఉన్నాయి. ఇంతకు చాలా సార్లు వాటి గురించి తెలుసుకున్నాం. అరటి ఆకులో భోజనం చేస్తే కాదు.. అరటి ఆకును తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని ఇటీవల చేసిన పలు పరిశోధనల్లో తేలింది. అరటి ఆకులో శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి ఆకులో ఎసెన్షియల్ ఫైటూ న్యూట్రియెంట్స్, సెలీనియం, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. మరి అరటి ఆకుల్ని తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

అరటి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఔషధ గుణాలు, ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది పటిష్టంగా తయారవుతుంది. శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌తో కూడా పోరాడుతుంది. ఎలాంటి వైరల్, ఇన్ ఫెక్షన్స్‌తో అయినా పోరాడి తర్వగా కోలుకోవడానికి హెల్స్ చేస్తుంది.

చర్మం ఆరోగ్యం:

అరటి ఆకులు తినడం వల్ల చర్మానికి ఎంతో మంచిది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా చర్మంపై అలర్జీలు, దద్దర్లు మొదలైనవి రాకుండా సహాయ పడుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది. జుట్టు కూడా బలంగా, దృఢంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్ అవుతారు:

అధిక బరువుతో బాధ పడేవారు అరటి ఆకులు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు మీ డైట్‌లో ప్రతి రోజూ కొద్ది మొత్తంలో అరటి ఆకును తీసుకోండి. ఈ ఆకులో పీచు పదార్థం అనేది మెండుగా ఉంటుంది. కాబట్టి త్వరగా కడుపు నిండుతుంది. అంతే కాకుండా అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొవ్వు నిల్వలను పెంచుతుంది. అదే విధంగా రక్త పోటును తగ్గిస్తుంది.

అరటి ఆకులను ఎలా తినాలి:

అరటి ఆకులను శుభ్రంగా కడిగి నేరుగా తినాలి అనుకునే వాళ్లు తినవచ్చు. లేదంటే అరటి ఆకులను మంచి నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఈ నీటితో హెర్బల్ టీ చేసుకుని కూడా గోరు వెచ్చగా తాగినా పర్వాలేదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..