Home Remedies: వాషింగ్ మిషన్‌లో బట్టలకు గంజి ఎలా పెట్టాలంటే..

|

Jul 21, 2024 | 5:03 PM

బట్టలకు గెంజి పెడితే ఎంతో చక్కగా కనిపిస్తాయి. ముఖ్యంగా కాటన్ చీరలు, కాటన్ దుస్తులకు, టవల్స్, దుప్పట్లు, బెడ్ షీట్లకు గంజి పెట్టకపోతే అస్సలు బాగోవు. అసలు చాలా మందికి గంజి పెట్టకుండా బట్టలు అస్సలు వేసుకోవాలని అనిపించదు. ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు చాలా మంది బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్స్ ఉపయోగిస్తున్నారు. కానీ వాషింగ్ మెషీన్‌లో గంజి పెట్టడం చాలా మంది తెలీదు. మళ్లీ బట్టలను తీసి గంజి పెట్టాల్సి వస్తుంది. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం..

Home Remedies: వాషింగ్ మిషన్‌లో బట్టలకు గంజి ఎలా పెట్టాలంటే..
Home Remedies
Follow us on

బట్టలకు గెంజి పెడితే ఎంతో చక్కగా కనిపిస్తాయి. ముఖ్యంగా కాటన్ చీరలు, కాటన్ దుస్తులకు, టవల్స్, దుప్పట్లు, బెడ్ షీట్లకు గంజి పెట్టకపోతే అస్సలు బాగోవు. అసలు చాలా మందికి గంజి పెట్టకుండా బట్టలు అస్సలు వేసుకోవాలని అనిపించదు. ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు చాలా మంది బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్స్ ఉపయోగిస్తున్నారు. కానీ వాషింగ్ మెషీన్‌లో గంజి పెట్టడం చాలా మంది తెలీదు. మళ్లీ బట్టలను తీసి గంజి పెట్టాల్సి వస్తుంది. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం గంజి పెట్టిన బట్టలు ఆరకుంటే చాలా చిరాకుగా ఉంటాయి. అలా కాకుండా వాషింగ్ మెషీన్‌లోనే మనం గంజి పెట్టి బట్టలు ఆరబెట్టుకోవచ్చు. మరి అదెలాగో.. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వాషింగ్ మెషీన్‌లో బట్టలకు గంజి ఎలా పెడతారంటే..

ముందుగా ఎప్పటిలాగే బట్టలను వాష్ చేసుకోవాలి. సాధారణంగానే బట్టలను ఉతికేయాలని. బట్టలను ఉతకడం అయిపోయాక మళ్లీ.. రిన్స్ సైకిల్‌ క్లిక్ చేసి బట్టలు పెట్టవచ్చు. లేదంటే ఫైనల్ రిన్స్ సైకి్ ముందు పాజ్ చేసి అప్పుడు గంజి వేయాలి. లిక్విడ్ స్టార్చ్ వాడితే.. ముందుగా బాటిల్‌ను బాగా షేక్ చేసి ఉపయోగించాలి.

ఒక వేళ మీరు పౌడర్ ఉపయోగించినట్లయితే.. బయటనే పౌడర్ కలిపి మెషీన్‌లో వేయాలి. ఇప్పుడు స్టార్చ్ లిక్విడ్, పౌడర్, గంజి అయినా నేరుగా బట్టలపై వేయకూడదు, డిటర్జెంట్ లేదా ఫ్యాబ్రిక్ సాఫెనర్‌ కోసం ఉన్న స్పేస్‌లో వేయాలి. ఆ తర్వాత బట్టలను రిన్స్ చేసి డ్రై చేయలి. ఆ తర్వాత తీసి బట్టలను ఆరేసుకోవచ్చు. బట్టలను బాగా దులిపి ఆరేస్తే ముడతలు లేకుండా ఉంటాయి. అయితే అన్ని బట్టలు ఒకేసారి వేసి రిన్స్ చేయకూడదు. కేవలం గంజి పెట్టాల్సిన బట్టలను మాత్రమే ఉంచి రిన్స్ చేయాలి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..