Potato Balls: వేడి వేడి పొటాటో బాల్స్.. ఇలా చేస్తే ఒకదాని తర్వాత మరొకటి లాగించేస్తారు..

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 8:57 PM

వర్షా కాలం వచ్చిందంటే చాలు.. సాయంత్రం పూట అలా వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ తినాలని అనిపిస్తుంది. పకోడీలు, బజ్జీలు, సమోసాలు, పునుగులు తింటూ ఉంటారు. ఎప్పుడూ ఇవే తిన్నా బోరు కొడుతుంది. ఇంట్లోనే వెరైటీగా బంగాళ దుంపలతో స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. బంగాళ దుంపలతో ఎలాంటి స్నాక్స్ తయారు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీ కోసమే ఇప్పుడు మరో కొత్త రెసిపీ తీసుకొచ్చాం. అవే పొటాటో బాల్స్. ఇవి బయట క్రంచీగా..

Potato Balls: వేడి వేడి పొటాటో బాల్స్.. ఇలా చేస్తే ఒకదాని తర్వాత మరొకటి లాగించేస్తారు..
Potato Balls
Follow us on

వర్షా కాలం వచ్చిందంటే చాలు.. సాయంత్రం పూట అలా వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ తినాలని అనిపిస్తుంది. పకోడీలు, బజ్జీలు, సమోసాలు, పునుగులు తింటూ ఉంటారు. ఎప్పుడూ ఇవే తిన్నా బోరు కొడుతుంది. ఇంట్లోనే వెరైటీగా బంగాళ దుంపలతో స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. బంగాళ దుంపలతో ఎలాంటి స్నాక్స్ తయారు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీ కోసమే ఇప్పుడు మరో కొత్త రెసిపీ తీసుకొచ్చాం. అవే పొటాటో బాల్స్. ఇవి బయట క్రంచీగా, లోపల నుంచి సాఫ్ట్‌గా చాలా రుచిగా ఉంటాయి. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. మరి ఇంత రుచికరమైన పొటాటో బాల్స్ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో బాల్స్‌‌కి కావాల్సిన పదార్థాలు:

బంగాళ దుంపలు, పచ్చి మిర్చి, అటుకులు, ఉప్పు, జీలకర్ర పొడి, పుదీనా, కొత్తిమీర, మైదాపిండి, నిమ్మరసం, ఆయిల్.

పొటాటో బాల్స్ తయారీ విధానం:

ముందుగా బంగాళదుంపల్ని ఉడికించాలి. ఆ తర్వాత తొక్క తీసేసి మెత్తగా మెదుపు కోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చి మిర్చి, నీటిలో తడిపి తీసిన అటుకులు, ఉప్పు, జీలకర్ర పొడి, పుదీనా, కొత్తిమీర, మైదాపిండి, నిమ్మరసం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్‌లా తయారు చేసుకోవాలి. కావాలి అనుకుంటే బ్రెడ్ క్రంబ్స్‌లో ఒక సారి రోల్ చేస్తే.. ఇంకా క్రంచీగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే.. తయారు చేసి పెట్టుకున్న బాల్స్‌ని వేసి ఎర్రగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పొటాటో బాల్స్ సిద్ధం. వీటిని టామటా కిచప్‌, పుదీనా చట్నీ, మయోనీస్‌తో కూడా తయారు చేసుకుని తినవచ్చు. నేరుగా తిన్నా చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.