Tati Garelu: గోదావరి స్పెషల్ తాటి గారెలు.. రుచితో పాటు ఆరోగ్యం..

|

Aug 11, 2024 | 8:28 PM

గోదారోళ్ల వంటలు చాలా స్పెషల్. ప్రపంచ వ్యాప్తంగా వీటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గోదారోళ్ల వంటలకు మామూలు క్రేజ్ ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో సీజన్‌లో ఒక్కో వంటకం చేస్తూ ఉంటారు. వర్షా కాలంలో ఎక్కువగా తాటి కాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీటితో చాలా రకాల వంటలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా తాటి గారెలు, రొట్టెలు, ఇడ్లీలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి వీటిని రుచి చూసారంటే..

Tati Garelu: గోదావరి స్పెషల్ తాటి గారెలు.. రుచితో పాటు ఆరోగ్యం..
Tati Garelu
Follow us on

గోదారోళ్ల వంటలు చాలా స్పెషల్. ప్రపంచ వ్యాప్తంగా వీటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గోదారోళ్ల వంటలకు మామూలు క్రేజ్ ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో సీజన్‌లో ఒక్కో వంటకం చేస్తూ ఉంటారు. వర్షా కాలంలో ఎక్కువగా తాటి కాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీటితో చాలా రకాల వంటలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా తాటి గారెలు, రొట్టెలు, ఇడ్లీలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి వీటిని రుచి చూసారంటే అస్సలు వదిలి పెట్టరు. తాటి కాయల గుజ్జుతో వీటిని చేస్తూ ఉంటారు. వీటిల్లో తాటి గారెలు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ తాటి గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

తాటి గారెలకు కావాల్సిన పదార్థాలు:

తాటి కాయల గుజ్జు, ఇడ్లీ రవ్వ, బెల్లం పొడి, కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు, ఆయిల్.

తాటి గారెలు తయారీ విధానం:

ముందుగా బాగా పండిన తాటి కాయలు తీసుకోవాలి. వీటి నుంచి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గుజ్జు తీసి ఓ అరగంట సేపు పక్కన వదిలేయాలి. ఆ నెక్ట్స్ కొబ్బరి తురుము కూడా తీసి పక్కన పెట్టాలి. అలాగే బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో తాటి గుజ్జును, ఇడ్లీ రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము, యాలకుల పొడి, ఉప్పు వేసి అంతా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. బెల్లానికి బదులు కావాలి అనుకుంటే చక్కెర కూడా ఉపయోగించవచ్చు. కానీ బెల్లం వేయడం వల్ల రుచి, ఆరోగ్యం కూడా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని గారెలుగా వేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఈ గారెలను చెరుకు రసంలో ముంచుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.