Oats Uttapam: డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..

డయాబెటీస్ ఏం తినాలన్నా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే.. వారు కొద్దిగా తిన్నా వారి బాడీలో షుగర్ లెవల్స్ అనేవి అమాంతం పెరిగిపోతాయి. దీంతో మరిన్ని సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి వీరు ఆహారంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు పోషకాలు నిండిన ఆహారం తినడం చాలా అవసరం. వీరి కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఓట్స్ ఊతప్పం రెసిపీ తీసుకొచ్చాం. ఈ రెసిపీని బ్రేక్ ఫాస్ట్‌గానే కాకుండా.. డిన్నర్‌గా కూడా తీసుకోవచ్చు. ఇది తినడం వల్ల షుగర్..

Oats Uttapam: డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
Oats Uttapam
Follow us
Chinni Enni

|

Updated on: Apr 19, 2024 | 6:06 PM

డయాబెటీస్ ఏం తినాలన్నా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే.. వారు కొద్దిగా తిన్నా వారి బాడీలో షుగర్ లెవల్స్ అనేవి అమాంతం పెరిగిపోతాయి. దీంతో మరిన్ని సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి వీరు ఆహారంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు పోషకాలు నిండిన ఆహారం తినడం చాలా అవసరం. వీరి కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఓట్స్ ఊతప్పం రెసిపీ తీసుకొచ్చాం. ఈ రెసిపీని బ్రేక్ ఫాస్ట్‌గానే కాకుండా.. డిన్నర్‌గా కూడా తీసుకోవచ్చు. ఇది తినడం వల్ల షుగర్ లెవల్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ రెసిపీ డయాబెటీస్ పేషెంట్ల కోసం ప్రత్యేకమనే చెప్పాలి. ఒక్కసారి రుచి చూశారంటే అస్సలు వదిలి పెట్టరు. మరి ఈ ఓట్స్ ఊతప్పం ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓట్స్ ఊతప్ప తయారీ విధానం:

ఓట్స్, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చి మిర్చి, ఉప్పు, పన్నీర్, పుల్లని పెరుగు, మిరియాల పొడి, ఉప్మారవ్వ, ఆయిల్ లేదా నెయ్యి.

ఓట్స్ మినీ ఉతప్పం తయారీ విధానం:

ముందుగా ఓట్స్‌ని మిక్సీలో వేసుకుని మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఓట్స్ పౌడర్ వేసి, ఉప్మా రవ్వ లేదా ఇడ్లీ రవ్వ, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో పుల్లని పెరుగు, కొద్దిగా నీళ్లు, మిరియాల పొడి వేసి కలిపి ఓ పది నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి.. ఊతప్పం షేప్‌లో వేసుకోవాలి. ఇప్పుడు చూట్టూ నెయ్యి లేదా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఆ తర్వాత ఊతప్పం పైన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చి మిర్చి, పన్నీర్, క్యాప్సికం ఇలా మీకు నచ్చినవి వేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మీడియం మంటపై మూత పెట్టి ఉడికించాలి. పైన ఉడికాక తిప్పి పైనుంచి మళ్లీ ఆయిల్ వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా ఊతప్పం కాలాక.. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని తినడమే. ఈ ఊతప్పం ఏ చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇది కేవలం డయాబెటీస్ వారే కాకుండా ఎవరైనా తినొచ్చు. ఎంతో ఆరోగ్యం కూడా. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.