AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cucumber Face Packs: మండే ఎండల్లోనూ మీ ముఖం చందమామలా మెరవాలంటే.. కీరతో ఈ ఫేస్‌ ప్యాక్‌లు ట్రై చేయండి

కీర దోస కేవలం తినడానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దానిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు నేరుగా చర్మం లోపలికి చొచ్చుకుపోయి, దాని కాంతిని పెంచడంలో సహాయపడతాయి. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా..

Cucumber Face Packs: మండే ఎండల్లోనూ మీ ముఖం చందమామలా మెరవాలంటే.. కీరతో ఈ ఫేస్‌ ప్యాక్‌లు ట్రై చేయండి
Cucumber Face Packs
Srilakshmi C
|

Updated on: May 08, 2026 | 9:20 PM

Share

ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి కీరదోస ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇది కేవలం తినడానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా మంచిది. దానిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు నేరుగా చర్మం లోపలికి చొచ్చుకుపోయి, దాని కాంతిని పెంచడంలో సహాయపడతాయి. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ఎండదెబ్బ వలన ఏర్పడిన నల్ల మచ్చలను త్వరగా తొలగిస్తుంది.

కలబంద-కీరదోస ఫేస్‌ ప్యాక్‌

ఎండ వేడిమి వల్ల చర్మం నల్లగా కమిలిపోతే.. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను తురిమిన కీరదోసతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని కేవలం 15 నిమిషాలు ఆగితే చాలు తాజాగా, కాంతివంతంగా ఉండే చర్మాన్ని పొందొచ్చు. ఈ కలబంద, కీరదోస ప్యాక్ ముఖ్యంగా ముడతలను తొలగించి, చర్మ స్థితిస్థాపకతను పునరుద్ధరించడానికి బాగా పనిచేస్తుంది. ఎండవల్ల వచ్చిన నల్లదనాన్ని తొలగించడానికి, కీరదోస గుజ్జును రెండు చెంచాల పెరుగుతో కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే అధిక నూనెను నియంత్రిస్తుంది. చర్మంలోని సహజ తేమను కాపాడుతూ దానిని మృదువుగా చేస్తుంది.

కీరదోస-పాలు ఫేస్‌ ప్యాక్

అర కప్పు పచ్చి కీరదోస గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు, చిటికెడు పసుపు పొడి కలిపి ఒక ప్యాక్ తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి, మెడకు పట్టించి 20-30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమం అన్ని రకాల చర్మాలకు అనుకూలమైనది. చర్మంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చర్మం కోల్పోయిన తేమను, కాంతిని తిరిగి పొందడానికి ఒక చెంచా తేనె, ఒక చెంచా రోజ్ వాటర్‌ను తురిమిన కీరదోసతో కలపాలి. ఈ ప్యాక్‌ను చర్మంపై అప్లై చేసి 25 నిమిషాల పాటు ఉంచడం వల్ల చర్మానికి లోపలి నుంచి తేమ అందుతుంది. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం మరింత మృదువుగా, నునుపుగా, మచ్చలు లేకుండా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

కీరదోస-శనగపిండి ఫేస్‌ ప్యాక్

శనగపిండి, కీరదోస రసం మిశ్రమం చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి, చర్మ కాంతిని పెంచడానికి ఉపయోగపడుతుంది. రెండు చెంచాల శనగపిండిని తగినంత కీరదోస రసంతో కలిపి చిక్కటి పేస్ట్ లా తయారుచేసి ముఖానికి, మెడకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత దీనిని కడిగేయాలి.

జిడ్డు చర్మ సమస్యలు, ముడతలను తగ్గించడానికి 2 టీస్పూన్ల కీరదోస రసంలో 1 టీస్పూన్ ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి, 30 నిమిషాల పాటు ఆగి, అది ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది ఎండదెబ్బ మచ్చలను చాలా త్వరగా తగ్గిస్తుంది. చర్మం సాగిపోకుండా నిరోధించడంలో ఈ ప్యాక్ సహాయపడుతుంది. కీరదోస వంటి సహజ పదార్థాలు చర్మానికి చాలా సురక్షితమైనవి. పైగా తక్కువ ఖర్చుతో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజమైన కాంతిని పొందడానికి ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌