Heart Pain: ఈ సంకేతాలతో గుండె నొప్పిని ముందుగానే కనిపెట్టవచ్చు..

|

Jun 24, 2024 | 4:58 PM

ఈ మధ్య కాలంలో గుండె నొప్పితో మరణించే వారి సంఖ్య బాగా పెరిగింది. పెద్దలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా చాలా మంది సడెన్ హార్ట్ ఎటాక్‌తో మరణించారు. గత రెండు సంవత్సరాలుగా గుండె నొప్పితో మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మారిన లైఫ్ స్టైల్ విధానం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది గుండె నొప్పితో మరణిస్తున్నారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా మరికొంత మంది..

Heart Pain: ఈ సంకేతాలతో గుండె నొప్పిని ముందుగానే కనిపెట్టవచ్చు..
Heart pain
Follow us on

ఈ మధ్య కాలంలో గుండె నొప్పితో మరణించే వారి సంఖ్య బాగా పెరిగింది. పెద్దలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా చాలా మంది సడెన్ హార్ట్ ఎటాక్‌తో మరణించారు. గత రెండు సంవత్సరాలుగా గుండె నొప్పితో మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మారిన లైఫ్ స్టైల్ విధానం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది గుండె నొప్పితో మరణిస్తున్నారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా మరికొంత మంది చనిపోతున్నారు. అయితే ఏ వ్యాధి అయినా వచ్చే ముందు కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ లక్షణాల ద్వారా మనం ఆ వ్యాధిని గుర్తించవచ్చు. మీ శరీరంలో ఎలాంటి తేడాలు వచ్చినా ముందుగా వైద్యుల్ని సంప్రదించడం మంచిది. అలాగే గుండె నొప్పి వచ్చే ముందు కూడా కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని బట్టి జాగ్రత్త పడటం అవసరం.

ఛాతీలో నొప్పి:

గుండె పోటు వచ్చే ముందు మీ ఛాతీ దగ్గర అసౌకర్యంగా ఉంటుంది. గుండె నొప్పి రావడంలో ఇది ముఖ్య సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఛాతీ దగ్గర చాలా అసౌకర్యంగా ఉండి.. ఒత్తిడిగా అనిపిస్తుంది. కానీ చాలా మంది దీన్ని అస్సలు లెక్క చేయరు. ఇలా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు.

ఎడమ చేయి నొప్పి:

గుండె పోటు వచ్చే ముందు రక్త ప్రసరణ అనేది తగ్గడం వల్ల.. గుండె కండరాలపై కూడా ఒత్తిడి పడుతుంది. ఎడమ చేతిలోని కండరాలు గుండె కండరాలకు అనుసంధానం చేసి ఉంటుంది. కాబట్టి చాలా మందికి ఎడమ చేతిలో కూడా నొప్పిగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

దవడ నొప్పి:

గుండె నొప్పి వచ్చే ముందు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. కానీ వీటిని పెద్దగా పట్టించుకోరు. ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు దవడ నొప్పి కూడా వస్తుంది. ఇది పంటి నొప్పి కంటే ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో ఎక్కువగా ఎడమ వైపున దవడ నొప్పి వస్తుంది. అంతే కాకుండా చల్లని ప్రదేశంలో కూడా ఎక్కువగా చెమటలు పట్టడం, గురక, వికారంతో ఉండి వాంతులు అవడం వల్ల కూడా గుండె నొప్పికి సంకేతాలుగా చెప్పొచ్చు.

వెన్ను నొప్పి:

వెన్ను నొప్పి కూడా గుండె పోటుకు వచ్చే ముందు కనిపించే ఓ సంకేతంగా చెప్పొచ్చు. వెన్ను భరించ లేనంతగా నొప్పి ఉంటే వైద్యుడ్ని సంప్రదించడం మేలు. మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

మెడ నొప్పి:

గుండె పోటు వచ్చే ముందు కనిపించే సాధారణ లక్షణాల్లో మెడ నొప్పి కూడా ఒకటి. గుండె నొప్పి మెల్లగా మెడకు వ్యాపిస్తుంది. మెడ వద్ద అలసటగా ఉండటం, కండరాల నొప్పులు కూడా గుండె నొప్పిగా చెప్పవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..