Turmeric Health Benefits: మీకు తెలుసా.. గ్యాస్ సమస్యను నివారించడంలో పసుపు ప్రభావశాలి.. తాజా పరిశోధనల్లో వెల్లడి

|

Sep 15, 2023 | 1:27 PM

భోజనం తిన్న తర్వాత ఒక్కోసారి గొంతు నొప్పి, గొంతు-ఛాతీ మంటగా అనిపిస్తుంది. దీంతో రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. ఇవి ఎసిడిటీ లక్షణాలు. బయటి ఆహారం తరచూ తినడం వల్ల గ్యాస్ సమస్య తలెత్తుతుంది. అయితే ఇంట్లో తయారుచేసిన ఆహారం తిన్నా చాలా మంది అజీర్తితో బాధపడుతుంటారు. ఇలా గ్యాస్ వల్ల గుండె మంట అనిపించినప్పుడు ప్రతిసారీ యాంటాసిడ్ తీసుకోవడం అంత మంచి పద్ధతి కాదు. అందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా..

Turmeric Health Benefits: మీకు తెలుసా.. గ్యాస్ సమస్యను  నివారించడంలో పసుపు ప్రభావశాలి.. తాజా పరిశోధనల్లో వెల్లడి
Turmeric Health Benefits
Follow us on

భోజనం తిన్న తర్వాత ఒక్కోసారి గొంతు నొప్పి, గొంతు-ఛాతీ మంటగా అనిపిస్తుంది. దీంతో రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. ఇవి ఎసిడిటీ లక్షణాలు. బయటి ఆహారం తరచూ తినడం వల్ల గ్యాస్ సమస్య తలెత్తుతుంది. అయితే ఇంట్లో తయారుచేసిన ఆహారం తిన్నా చాలా మంది అజీర్తితో బాధపడుతుంటారు. ఇలా గ్యాస్ వల్ల గుండె మంట అనిపించినప్పుడు ప్రతిసారీ యాంటాసిడ్ తీసుకోవడం అంత మంచి పద్ధతి కాదు. అందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసంర. తద్వారా అజీర్తి సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆహారంలో పసుపు తినడం వల్ల అజీర్ణ సమస్య నివారించవచ్చని తాజా పరిశోధనలు పేర్కొంటున్నాయి. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన అధ్యయనం ప్రకారం.. పసుపు అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది సహజంగా ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పసుపులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి.

18 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న దాదాపు 206 మంది రోగుపై ఈ అధ్యయనం నిర్వహించారు. 206 మందిలో ఒక్కొక్కరు చాలా కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. దీనిని ఫంక్షనల్ డిస్‌స్పెప్సియా అంటారు. ఈ రోగులు థాయ్‌లాండ్‌లోని వివిధ ఆసుపత్రుల్లో వివిద పద్ధతుల్లో చికిత్స తీసుకున్నారు. ఈ 206 మంది రోగుల్లో ఒక్కొక్కరికి 28 రోజుల ట్రయల్ నిర్వహించారు. కడుపు సంబంధిత వ్యాధులను తగ్గించడంలో పసుపు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

ఔషధాలతో పోలిస్తే పసుపు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో ధృవీకరించడానికి ఈ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనంలో పాల్గొనేవారిని 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్‌లోని 69 మందికి చిన్న డమ్మీ క్యాప్సూల్స్‌తో రోజుకు నాలుగు సార్లు 250 గ్రాముల కర్కుమిన్ (పసుపు) ఇచ్చారు. రెండవ గ్రూప్‌లోని 68 మంది రోగులకు ఒమెప్రజోల్ అనే 20 మిల్లీగ్రాముల క్యాప్సూల్‌ను రెండు రోజుల పాటు రోజుకు నాలుగు సార్లు క్యాప్సూల్స్‌ అందించారు. మిగతా 69 మంది రోగులకు పసుపు, ఒమెప్రజోల్ కలగలిపిన క్యాప్యూల్స్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ అధ్యయనంలో 28 రోజుల తర్వాత రోగుల్లో లక్షణాలను గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా నొప్పి, శారీరక అసౌకర్యం తొలగిపోయింది. ఒమెప్రజోల్‌తో పసుపును తీసుకున్నవారిలో 56వ రోజున లక్షణాలు తీవ్రమయ్యాయి. దీంతో పసుపు అనేక జీర్ణ సమస్యలపై కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. అయితే పసుపు ప్రభావవంతంగా పనిచేస్తున్నప్పటికీ ఎల్లప్పుడూ మోతాదుకు మించి మాత్రమే తీసుకోవాలి. ఈ విషయంలో మరింత పరిశోధన జరగాల్సి ఉంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.