Hug Benefits: జస్ట్ 20 సెకన్ల పాటు హగ్‌ చేసుకుంటే.. బోలెడన్ని బెనిఫిట్స్..

| Edited By: Ravi Kiran

Jul 28, 2024 | 7:30 PM

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ హిట్ మూవీ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాను మీరు చూసే ఉంటారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో ఒకానొక హిట్ మూవీ. కామెడీ అండ్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది ఈ మూవీ. ఇప్పుడు ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చింది అనే కదా అంటారు. ఈ సినిమాలోని 'జంతర్ మంతర్ చూ మంతర్ ఖాళీ' అనే డైలాగ్ గుర్తుందా.. ఈ మూవీలోని హగ్ చేసుకోవడం వల్ల ఎదుటి వారి కోపం, ఆవేశాన్ని తగ్గించవచ్చని, తమపై ప్రేమను పెంచుకోవచ్చని..

Hug Benefits: జస్ట్ 20 సెకన్ల పాటు హగ్‌ చేసుకుంటే.. బోలెడన్ని బెనిఫిట్స్..
Hug Benefits
Follow us on

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ హిట్ మూవీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాను మీరు చూసే ఉంటారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో ఒకానొక హిట్ మూవీ. కామెడీ అండ్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది ఈ మూవీ. ఇప్పుడు ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చింది అనే కదా అంటారు. ఈ సినిమాలోని ‘జంతర్ మంతర్ చూ మంతర్ ఖాళీ’ అనే డైలాగ్ గుర్తుందా.. ఈ మూవీలోని హగ్ చేసుకోవడం వల్ల ఎదుటి వారి కోపం, ఆవేశాన్ని తగ్గించవచ్చని, తమపై ప్రేమను పెంచుకోవచ్చని చిరు చెప్తాడు. ఇప్పుడు ఇదే హగ్ మూమెంట్ బెస్ట్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మిమ్మల్ని ప్రేమించే వాళ్లను ఓ 20 సెకన్ల పాటు ప్రతి రోజూ హగ్ చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి తగ్గుతుంది:

హగ్ చేసుకోవడం వల్ల హాయిగా అనిపిస్తుంది. దీంతో బాడీలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీన్ని ప్రేమ హార్మోన్ లేదా కడిల్ హార్మోన్ అని అంటారు. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనసును రిలాక్స్ చేస్తుంది.

బంధం బలపడుతుంది:

హగ్ చేసుకోవడం వల్ల మీది ఎలాంటి బంధం అయినా మెరుగు పడుతుంది. 20 సెకన్ల పాటు కౌగిలించు కోవడం వల్ల చేసుకుని ఉండటం వల్ల మీ బంధం అనేది మెరుగు పడుతుంది. శారీరక స్మర్శ అనేది ప్రియమైన వారితో భావోద్వేగ బంధాలను బలోపేతం చేస్తుంది. మీ మధ్య ప్రేమ, అప్యాయతను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది:

కౌగిలించు కోవడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మెరుగు పడుతుంది. రెగ్యులర్‌గా హగ్ చేసుకోవడం వల్ల శరీరంలో మీ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.

సంతోషంగా ఉంటారు:

ప్రతిరోజూ హగ్ చేసుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. హగ్ చేసుకోవడం వల్ల హ్యాపీ హార్మోన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన తగ్గించి.. మనసును తేలిక పరుస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. మీ మానసిక స్థితిని గణనీయంగా మెరుగు పరుస్తుంది. అలాగే మీ మధ్య కమ్యునికేషన్ అనేది బల పడుతుంది. కోపం అనేది కూడా తగ్గుతుంది. గుండె ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..