Ginger Uses: వర్షా కాలంలో జబ్బులను దూరం చేసే అల్లం.. తెలిస్తే వదిలి పెట్టరు..

|

Aug 04, 2024 | 5:25 PM

వర్షా కాలంలో ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం కాస్త అశ్రద్ధగా ఉన్నా అనేక అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే ఇన్ ఫెక్షన్లు, రోగాల నుంచి బయట పడాలంటే ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో అల్లం కూడా ఒకటి. అల్లం మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అల్లం ఒక దివ్యౌషధం. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లంతో ఎన్నో రకాల అనారోగ్య..

Ginger Uses: వర్షా కాలంలో జబ్బులను దూరం చేసే అల్లం.. తెలిస్తే వదిలి పెట్టరు..
Ginger
Follow us on

వర్షా కాలంలో ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం కాస్త అశ్రద్ధగా ఉన్నా అనేక అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే ఇన్ ఫెక్షన్లు, రోగాల నుంచి బయట పడాలంటే ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో అల్లం కూడా ఒకటి. అల్లం మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అల్లం ఒక దివ్యౌషధం. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. ప్రస్తుతం వర్షా కాలంలో వైరల్ ఇన్ ఫెక్షన్లు, బ్యాక్టీరియా వంటి వాటి నుంచి అల్లంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి ఈ సీజన్‌లో అల్లాన్ని ఎలా తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లంలోని పోషకాలు:

విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, జింజెరాల్, షాగోల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

గొంతు నొప్పి మాయం:

వర్షా కాలం, చలి కాలంలో ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో గొంతు నొప్పి కూడా ఒకటి. వైరల్ ఇన్ ఫెక్షన్స్, బ్యాక్టీరియా కారణంగా గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి వచ్చిందంటే ఏమీ తినడానికి, తాగడానికి ఉండదు. చాలా నొప్పిగా ఉంటంది. కానీ అల్లం రసం తాగితే త్వరలోనే మంచి ఫలితం ఉంటుంది. అల్లాన్ని రసంలా చేసి దానికి కొద్దిగా తేనె, ఉప్పు జోడించి తీసుకోవచ్చు. అలాగే అల్లం ముక్కపై పసుపు చల్లి.. ఒక నిమిషం మంటప కాల్చి తినడం వల్ల కూడా గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

అల్లాన్ని నీటిలో మరిగించి కొద్దిగా తేనె కలిపి తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. అల్లం టీ పైన చెప్పిన విధంగా తాగలేని వారు పాలు కూడా కలిపి తాగవచ్చు.

జలుబు – దగ్గు మాయం:

అల్లాన్ని ముక్కలుగా చేసి నీటిలో మరిగించి నేరుగా కషాయంలా తాగితే జలుబు, దగ్గు వంటివి తగ్గుతాయి. కఫం వంటివి ఏమన్నా ఉన్నా బయటకు వచ్చేస్తుంది.

ఆహారంతో పాటు:

అల్లాన్ని నేరుగా, కషాయంలా తీసుకోలేని వారు. ప్రతి రోజూ వండే కూరల్లో అల్లాన్ని చేర్చండి. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కండరాల నొప్పులు వంటివి కూడా తగ్గుతాయి. రోజూ అల్లం తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పిని కూడా తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..