Get Rid of Paint Stains: టైల్స్, స్విచ్ బోర్డులపై పడ్డ మరకలను ఇలా పోగొట్టండి..

|

Aug 08, 2024 | 6:14 PM

సాధారణంగా గోడలపై అప్పుడప్పుడూ పెయింట్స్ వేయిస్తూ ఉంటారు. పెయింట్స్ వేసే క్రమంలో టైల్స్, ఫ్లోర్, స్విచ్ బోర్డులప మరకలు ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. ఈ పెయింట్ మరకలను అప్పటికప్పుడు తుడిస్తేనే పోతాయి. లేదంటే మొండి మరకలు అలానే ఉండి పోతాయి. కానీ ఆ సమయంలో ఏదో ఒక పని ఉండవచ్చు. లేదా మర్చిపోవచ్చు. ఆ తర్వాత ఈ పెయింట్ మరకల్ని ఎంత తుడిచినా అస్సలు పోనే పోవు. దీంతో అలానే వదిలేస్తారు. కానీ కొన్ని రకాల ట్రిక్స్ ట్రై చేస్తే..

Get Rid of Paint Stains: టైల్స్, స్విచ్ బోర్డులపై పడ్డ మరకలను ఇలా పోగొట్టండి..
Get Rid Of Paint Stains
Follow us on

సాధారణంగా గోడలపై అప్పుడప్పుడూ పెయింట్స్ వేయిస్తూ ఉంటారు. పెయింట్స్ వేసే క్రమంలో టైల్స్, ఫ్లోర్, స్విచ్ బోర్డులప మరకలు ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. ఈ పెయింట్ మరకలను అప్పటికప్పుడు తుడిస్తేనే పోతాయి. లేదంటే మొండి మరకలు అలానే ఉండి పోతాయి. కానీ ఆ సమయంలో ఏదో ఒక పని ఉండవచ్చు. లేదా మర్చిపోవచ్చు. ఆ తర్వాత ఈ పెయింట్ మరకల్ని ఎంత తుడిచినా అస్సలు పోనే పోవు. దీంతో అలానే వదిలేస్తారు. కానీ కొన్ని రకాల ట్రిక్స్ ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా టైల్స్‌పై పడ్డ పెయింట్, స్విచ్ బోర్డులపై పడ్డ మరకల్ని ఈజీగా పోగొట్టవచ్చు. మరి ఆ కిచెన్ హ్యాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మయోనైజ్‌:

ఏంటి ఇది విని షాక్‌కి గురయ్యారా? మీరు విన్నది నిజమే. మయోనైజ్‌తో పెయింటింగ్ మరకల్ని వదిలించవచ్చు. పెయింటింగ్ మరకలు పడి కొద్ది సేపే అయినట్టు అయితే మయోనైజ్‌తో వాటిని పోగొట్టవచ్చు. ఇది మరకల్ని పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది. మయోనైజ్‌తో టైల్స్, డోర్ హ్యాండిల్స్, టైల్స్, ఫ్లోర్స్ మీద పడ్డ మరకలను తొలగించవచ్చు.

వెనిగర్:

వెనిగర్ అనేది బెస్ట్ కిచెన్ హ్యాక్ అండ్ క్లీనింగ్ హ్యాక్‌లా చక్కగా పని చేస్తుంది. ఎలాంటి మొండి మరకలను వదిలించడానికి వెనిగర్ అనేది చక్కగా సహాయ పడుతుంది. పెయింట్ మరకలు పడ్డ చోట కొద్దిగా వెనిగర్ వేసి రుద్దండి స్క్రబ్బర్ లేదా గట్టిగా ఉండే క్లాత్ సహాయంతో తుడిస్తే వస్తుంది. అదే విధంగా స్విచ్ బోర్డుల మీద పడ్డ మరకలను కూడా తొలగించవచ్చు.

ఇవి కూడా చదవండి

బాత్రూమ్ క్లీనర్:

పెయింటింగ్ వంటి మొండి మరకలను బాత్రూమ్ క్లీనర్ సహాయంతో కూడా తొలగించవచ్చు. కొద్దిగా మగ్గులో వాటర్, బాత్రూమ్ క్లీనర్ కలపండి. ఇది బాగా మిక్స్ చేసి మరకలపై వేయండి. ఆ తర్వాత స్క్రబ్బర్, క్లాత్‌ సహాయంతో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే త్వరగా మరకలు పోతాయి. అయితే ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. టైల్స్‌పై బాత్రూమ్ క్లీనర్ ఉపయోగించినప్పుడు కలర్ మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్లీనర్ వేసిన వెంటనే తుడిచేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..