యవ్వనంగా కనిపించడానికి.. వృద్ధాప్యాన్ని పూర్తిగా దూరం చేయాడానికి జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇవి పెద్ద మార్పులు కాదు కానీ, రోజువారీ జీవితం కోసం ఎంతో ముఖ్యమైనవే. ఈ మార్పుల ద్వారా శరీరానికి సరైన సంరక్షణ కల్పించి యవ్వనత్వాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హెల్తీ ఫుడ్
ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అధిక చక్కెర, ప్రిజర్వేటివ్లు, అనారోగ్యంకు గురయ్యే ఆయిల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో కొల్లాజెన్‌ను క్షీణింపజేసి స్కిన్ ని ముడతలు పడేలా చేస్తాయి. కాబట్టి వీటి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, శుభ్రమైన ప్రోటీన్లు వంటి పూర్తి ఆహారాలను తీసుకోవడం మంచిది. ఇలాంటి ఫుడ్ స్కిన్ కి సహజమైన మెరుపునిచ్చి, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
నిద్ర చాలా అవసరం
తగినంత నిద్రపోవడం ద్వారా కూడా శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. రాత్రి నిద్ర సమయంలో కొల్లాజెన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది మీ స్కిన్ ని మృదువుగా, బలంగా ఉంచుతుంది. అందుకే ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర పోవడం చాలా ముఖ్యం. ఇది స్కిన్ ని మాత్రమే కాదు, మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.
శరీరానికి తగినంత వాటర్ అవసరం
శరీరానికి తగినంత వాటర్ అందకపోతే స్కిన్ పొడిబారిపోతుంది. రోజంతా తగినంత వాటర్ తాగడం ద్వారా స్కిన్ తేమను నిలుపుకుంటుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.
డిజిటల్ డివైజ్ ల ప్రభావం
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు వంటి డివైజ్ లు స్కిన్ కి హాని చేస్తాయి. ఇది నిద్ర విధానాలను కూడా ప్రభావితం చేస్తుంది. స్క్రీన్ ని అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ ని, కళ్లను ఆరోగ్యంగా ఉంచవచ్చు.
వ్యాయామం
నిత్యం వ్యాయామం చేయడం శరీరానికి ప్రాణవాయువును, పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ఇది మీ స్కిన్ కి అవసరమైన రక్త ప్రసరణను పెంచి, కణాలను బలంగా ఉంచుతుంది. అలాగే మీ స్కిన్ ని బొద్దుగా, యవ్వనంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులను మీ జీవితంలో ఉంచుకోవడం ద్వారా మీరు యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించవచ్చు.