Baby Corn Manchurian: రెస్టారెంట్ స్టైల్ లో బేబీ కార్న్ మంచూరియా రెసిపీ మీ కోసం.. చల్లని వాతావరణంలో వేడివేడిగా అందించండి..

|

Jun 20, 2024 | 7:29 PM

ఎక్కువ మంది బేబీ కార్న్ మంచూరియాని రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకుని ఆస్వాదిస్తారు. ఈ నేపధ్యంలో ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ లో బేబీ కార్న్ మంచూరియాను తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.. చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి బేబీ కార్న్ మంచూరియాను తినడానికి పిల్లలు పెద్దలు ఇష్టపడతారు. దీనిని ఈజీగా తయారు చేసుకుందాం

Baby Corn Manchurian: రెస్టారెంట్ స్టైల్ లో బేబీ కార్న్ మంచూరియా రెసిపీ మీ కోసం.. చల్లని వాతావరణంలో వేడివేడిగా అందించండి..
Baby Corn Manchurian
Follow us on

స్వీట్ కార్న్ మాదిరిగానే ఉన్నా చాలా చిన్నవిగా బొమ్మల్లా అందంగా కనిపిస్తూ కనువిందు చేయడమే కాదు.. రుచికరంగా ఉంటాయి బేబీ కార్న్‌. వీటిని తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే బేబీ కార్న్‌ తో రకరకాల వంటకాలు, స్నాక్స్ ను చేస్తారు. బేబీ కార్న్ బిర్యానీ, బేబీ కార్న్‌ సూప్‌, బేబీ కార్న్‌ సలాడ్‌, బేబీ కార్న్ ఫింగర్స్‌, బేబీ కార్న్ మంచురియా ఇలా రకరకాల ఆహారాన్ని తయారు చేసుకుంటారు. అయితే ఎక్కువ మంది బేబీ కార్న్ మంచూరియాని రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకుని ఆస్వాదిస్తారు. ఈ నేపధ్యంలో ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ లో బేబీ కార్న్ మంచూరియాను తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.. చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి బేబీ కార్న్ మంచూరియాను తినడానికి పిల్లలు పెద్దలు ఇష్టపడతారు. దీనిని ఈజీగా తయారు చేసుకుందాం ఇలా

కావాల్సిన పదార్ధాలు

  1. బేబీ కార్న్ – పది
  2. మైదాపిండి -2 స్పూన్లు
  3. కార్న్ ఫ్లోర్ – 3 స్పూన్లు
  4. అల్లం వెల్లుల్లి పేస్టు – 2 స్పూన్లు
  5. ఇవి కూడా చదవండి
  6. చిల్లీ సాస్ – ఒక స్పూను
  7. సోయాసాస్ – రెండు స్పూన్లు
  8. టమాటా సాస్ – రెండు స్పూన్లు
  9. ఉల్లిపాయ – ఒకటి(చిన్న ముక్కలు)
  10. పచ్చిమిర్చి- చిన్న చిన్న ముక్కలు
  11. వెల్లుల్లి తరుగు – అర స్పూను
  12. కారం – ఒక స్పూను
  13. ఉల్లికాడల తరుగు – ఒక స్పూను
  14. ఉప్పు – రుచికి సరిపడా
  15. నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం: ముందుగా సన్నగా లేతగా ఉన్న బేబీ కార్న్‌ లను తీసుకుని వాటిని కడిగి రెండుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బేబీ కార్న్‌ లను ఒక గిన్నెలో వేసుకుని అందులో కార్న్ ఫ్లోర్, మైదా పిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం కొంచెం నీరు వేసి ఈ మిశ్రమం బేబీ కార్న్‌ లకు పట్టేలా కలుపుకోవాలి. వీటిని ఓ పక్కకు పెట్టి.. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు మిశ్రమం కలిపిన బేబీ కార్న్‌ లను నూనే వేసి వేయించుకోవాలి. వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ వేరే బాణలి పెట్టి అందులో నూనే వేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసి వేయించి ఇప్పుడు మంట స్విమ్ లో పెట్టి.. కొంచెం టమాటా సాస్, సోయా సాస్, చిల్లి సాస్ వేసి వేయించాలి. తర్వాత టెస్ట్ కు సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని కలిపి ఈ మిశ్రమంలో వేయించుకున్న బేబీ కార్న్ వేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం సేపు వేయించిన తర్వత స్టవ్ ఆఫ్ చేసి తరిగిన ఉల్లికోడు ముక్కలు వేసుకుని స్టవ్ మీద నుంచి దింపి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో టెస్టి టెస్టి బేబీ కార్న్ మంచురియా రెడీ..

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..