శక్తికి కేరాఫ్ అడ్రస్ ఇది.. ఇది ఒక్క గ్లాస్ తాగండి.. ఫుల్లుగా విటమిన్లు, ఖనిజాలు..

రాగి జావలో కాల్షియం, ఐరన్, డైటరీ ఫైబర్, ప్రోటీన్లు, బి విటమిన్లు వంటి పోషకాలు లభిస్తాయి. ఉదయపు ఆహారంలో రాగిని చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన భావన, పోషకాల అందుబాటు, ఎముకల ఆరోగ్యానికి మద్దతు వంటి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారు రాగి జావలో చక్కెర లేదా బెల్లం పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

శక్తికి కేరాఫ్ అడ్రస్ ఇది.. ఇది ఒక్క గ్లాస్ తాగండి.. ఫుల్లుగా విటమిన్లు, ఖనిజాలు..
Ragi Java Benefits

Updated on: Oct 05, 2026 | 7:50 AM

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉదయాన్నే తీసుకునే ఆహారం ఎంతో కీలకం.. అల్పాహారం మనల్ని ఉత్సాహావంతంగా ఆరోగ్యకరంగా ఉండటంటో కీలక పాత్ర పోషిస్తుంది.. అలాగే.. రోజుకు అవసరమైన శక్తిని, పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.. అందుకే తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు.. అలాంటి అద్భుతమైన పోషకాహారంలో రాగులు ఒకటి.. రాగి జావలో శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. క్యాల్షియం, ఐరన్ , డైటరీ ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు B1, B2, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా.. రాగి జావ (Ragi Java) ఉదయాన్నే అద్భుతమైన సూపర్‌ఫుడ్‌గా పనిచేస్తుంది. పోషకాల గని అయిన రాగి జావను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల లభించే ముఖ్య ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

రాగి జావ ఆరోగ్య ప్రయోజనాలు:

తక్షణ శక్తి – వ్యాధి నిరోధక శక్తి: ఉదయాన్నే రాగి జావ తాగడం వల్ల శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి.

బరువు నియంత్రణ: రాగిలో ఉండే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల పదే పదే ఆహారం తినాలనే కోరిక తగ్గి, సులభంగా బరువు తగ్గొచ్చు.

ఎముకల పుష్టి: రాగిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను, పళ్లను బలంగా ఉంచడమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలు రాకుండా కాపాడుతుంది.

డయాబెటిస్ నియంత్రణ: రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండటం వల్ల రక్తంగా చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.

రక్తహీనతకు చెక్: ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరిగి, రక్తహీనత తగ్గుతుంది.

రోజువారీ ఉదయపు సమయాల్లో కాఫీ, టీలకు బదులుగా ఒక గ్లాసు రాగి జావ తాగడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభించి రోజుమొత్తం ఉత్సాహంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us