AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 డేస్ నో షుగర్ ఛాలెంజ్.. శరీరంలో అద్భుతాలే జరుగుతాయ్.. అస్సలు నమ్మలేరు

రోజూ తీసుకునే టీ, కాఫీ నుంచి స్వీట్లు, కూల్‌డ్రింక్స్ వరకు పంచదార మన జీవితంలో భాగమైపోయింది. అయితే కేవలం 30 రోజుల పాటు షుగర్‌కు పూర్తిగా దూరంగా ఉంటే శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం, చర్మం మెరుస్తూ యవ్వనంగా కనిపించడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం, డయాబెటిస్ ముప్పు తగ్గడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడిస్తున్నారు.

30 డేస్ నో షుగర్ ఛాలెంజ్.. శరీరంలో అద్భుతాలే జరుగుతాయ్.. అస్సలు నమ్మలేరు
No sugar challenge
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: May 20, 2026 | 6:07 PM

Share

మన రోజువారీ ఆహారంలో తెలియకుండానే వైట్ పాయిజన్ లాంటి షుగర్ (పంచదార) భాగమైపోయింది. ఉదయం తాగే కాఫీ, టీల నుంచి.. తినే బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, స్వీట్ల వరకు అన్నింటిలోనూ షుగర్ నిండిపోతోంది. అయితే.. చాలా రోగాలకు షుగర్ కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత మేరకు షుగర్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, కేవలం 30 రోజుల పాటు పంచదారకు పూర్తిగా దూరంగా ఉంటే శరీరంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తాయో తెలుసా?.. అస్సలు నమ్మలేరు.. నెల రోజులు షుగర్ కట్ తో శరీరంలో ఏం జరుగుతుంది..? హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న ఆ ఆసక్తికరమైన విషయాలు.. ఏంటి అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

1. బరువులో స్పష్టమైన మార్పు: షుగర్ మానేయడం వల్ల శరీరంలోకి వెళ్లే అనవసరపు క్యాలరీలు ఆగిపోతాయి. దీనివల్ల ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరగడం ప్రారంభమవుతుంది. నెల రోజుల్లోనే మీ బరువులో స్పష్టమైన మార్పును గమనించవచ్చు.

2. ముఖంలో గ్లో.. యవ్వనంగా కనిపిస్తారు: ఎక్కువగా షుగర్ తింటే రక్తంలోని గ్లూకోజ్.. కొల్లాజెన్‌తో కలిసి గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారితీస్తుంది. దీనివల్ల చర్మంపై ముడతలు, మొటిమలు వస్తాయి. 30 రోజుల పాటు షుగర్ మానేస్తే చర్మం మళ్లీ నిగారింపును సంతరించుకుంటుంది. మీ వయస్సు మరింత యవ్వనంగా కనిపిస్తుంది.

3. రోజంతా ఫుల్ ఎనర్జీ: స్వీట్లు తిన్న వెంటనే ఒంట్లో ఎనర్జీ వచ్చినట్టు అనిపించినా, కాసేపటికే షుగర్ క్రాష్ జరిగి నీరసం వచ్చేస్తుంది. అదే షుగర్ పూర్తిగా మానేస్తే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీనివల్ల రోజంతా అలసట లేకుండా యాక్టివ్‌గా ఉంటారు.

4. గుండె ఆరోగ్యం భద్రం: అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల బీపీ పెరగడంతో పాటు గుండె జబ్బుల ముప్పు ఎక్కువవుతుంది. కేవలం నెల రోజులు షుగర్‌కు దూరంగా ఉంటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె పనితీరు మెరుగవుతుందని పరిశోధనల్లో తేలింది.

5. ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్: మనం తినే చక్కెరను లివర్ మాత్రమే ప్రాసెస్ చేయగలదు. ఎక్కువ షుగర్ తీసుకుంటే అది కొవ్వుగా మారి లివర్‌లో పేరుకుపోతుంది. షుగర్ మానేయడం వల్ల కాలేయం తనను తాను క్లీన్ చేసుకుని, టాక్సిన్స్ బయటకు పంపేస్తుంది.

6. ప్రశాంతమైన నిద్ర: మెరుగైన మానసిక స్థితి: చక్కెర ఎక్కువగా తీసుకునే వారిలో నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. షుగర్ మానేసిన మొదటి వారం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. ఆ తర్వాత బ్రెయిన్ ఫంక్షన్ మెరుగై, రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి.

7. డయాబెటిస్ ముప్పు మాయం: శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్లే టైప్-2 డయాబెటిస్ వస్తుంది. నెల రోజుల పాటు షుగర్ తీసుకోకపోతే ప్యాంక్రియాస్‌పై ఒత్తిడి తగ్గి, ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధీకరించబడుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి వస్తాయి.

30 రోజుల నో-షుగర్ ఛాలెంజ్ ప్రారంభించిన మొదటి 3-4 రోజులు క్రేవింగ్స్ అంటే షుగర్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటాయి. కానీ, ఆ మైండ్ గేమ్‌ను దాటి 30 రోజులు పూర్తి చేస్తే.. మీ శరీరం సరికొత్తగా మారుతుంది. అయితే, షుగర్ మానేయడం అంటే కేవలం తెల్లటి చక్కెర మాత్రమే కాదు.. ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, మైదాతో చేసిన బేకరీ ఐటమ్స్‌కు కూడా దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us