Kobbari Rice: లంచ్ బాక్స్‌లోకి త్వరగా అయిపోయే టేస్టీ కొబ్బరి రైస్..

| Edited By: Shaik Madar Saheb

Aug 07, 2024 | 9:53 PM

ప్రస్తుత కాలంలో అంతా బిజీ లైఫ్ అయిపోయింది. పిల్లలకు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తుంటే.. పేరెంట్స్ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉదయం అంతా హడావిడిగా ఉంటుంది. అందులోనూ వంట ఏం చేయాలి? అని తలలు పట్టుకుంటారు మహిళలు. ఆరోగ్యంగా ఉండాలి.. త్వరగా అయిపోవాలి.. అందరికీ నచ్చాలి.. ఇలా త్వరగా అయిపోయే వాటిల్లో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి రైస్ కూడా ఒకటి. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడూ ఇలా చేసి..

Kobbari Rice: లంచ్ బాక్స్‌లోకి త్వరగా అయిపోయే టేస్టీ కొబ్బరి రైస్..
Kobbari Rice
Follow us on

ప్రస్తుత కాలంలో అంతా బిజీ లైఫ్ అయిపోయింది. పిల్లలకు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తుంటే.. పేరెంట్స్ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉదయం అంతా హడావిడిగా ఉంటుంది. అందులోనూ వంట ఏం చేయాలి? అని తలలు పట్టుకుంటారు మహిళలు. ఆరోగ్యంగా ఉండాలి.. త్వరగా అయిపోవాలి.. అందరికీ నచ్చాలి.. ఇలా త్వరగా అయిపోయే వాటిల్లో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి రైస్ కూడా ఒకటి. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడూ ఇలా చేసి పెడుతూ ఉంటారు. వెరైటీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా చేసేయవచ్చు. ఈ రైస్‌ని నేరుగా తినేయవచ్చు. లేదంటే సైడ్ డిష్‌గా సింపుల్‌గా ఏదో ఒకటి చేస్తే సరి. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి రైస్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

కొబ్బరి, బియ్యం, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, తాళింపు దినుసులు, పల్లీలు, జీడిపప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తురుము, ఆయిల్ లేదా నెయ్యి.

కొబ్బరి రైస్‌ తయారీ విధానం:

ముందుగా బియ్యాన్ని పొడి పొడిగా ఉండేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ రుచిగా ఉంటుంది. కొబ్బరి కూడా తురిమి పక్కన పెట్టండి. కొబ్బరి ఫ్రెష్‌ది అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ లేదా నెయ్యి వేయండి. అల్లం ముక్కలు, పచ్చి మిర్చి వేసి వేయించండి. ఆ తర్వాత పల్లీలు, జీడిపప్పు వేసి వేగాక.. తాళింపు దినుసులు వేయాలి.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా బాగా వేగాక ఎండు మిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ వేయండి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టిన అన్నం కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఒకసారి ఉప్పు రుచి చూసుకుని వేసుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి రైస్ సిద్ధం. ఈ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది. చర్మానికి, జుట్టుకు మంచి పోషకాలు అందుతాయి.