Kaju Pulao: లంచ్ బాక్స్‌కి టేస్టీగా ఫాస్ట్‌గా అయ్యే కాజు పులావ్..

| Edited By: Ram Naramaneni

Aug 11, 2024 | 10:06 PM

స్కూల్లు, కాలేజీలు స్టార్ట్ అయ్యాక మధ్యాహ్నం లంచ్‌ ఏం చేయాలా? అని తల్లులు తలలు పట్టుకుంటారు. టేస్టీగా ఉండాలి.. హెల్దీగా ఉండాలి అంటే.. ఫాస్ట్‌గా అయిపోవాలి అంటే కాస్త ఆలోచించాల్సిందే. కానీ మీకు ఆ అవసరం లేదు. లంచ్ బాక్స్‌ కోసం స్పెషల్‌ రెసిపీలు మీ కోసం తీసుకొచ్చేస్తున్నాం. ఇలా రుచిగా.. సులువుగా అయిపోయే వాటిల్లో కాజు పులావ్ కూడా ఒకటి. ఈ వంటకం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా. అంతే కాదు సింపుల్‌గా..

Kaju Pulao: లంచ్ బాక్స్‌కి టేస్టీగా ఫాస్ట్‌గా అయ్యే కాజు పులావ్..
Kaju Pulao
Follow us on

స్కూల్లు, కాలేజీలు స్టార్ట్ అయ్యాక మధ్యాహ్నం లంచ్‌ ఏం చేయాలా? అని తల్లులు తలలు పట్టుకుంటారు. టేస్టీగా ఉండాలి.. హెల్దీగా ఉండాలి అంటే.. ఫాస్ట్‌గా అయిపోవాలి అంటే కాస్త ఆలోచించాల్సిందే. కానీ మీకు ఆ అవసరం లేదు. లంచ్ బాక్స్‌ కోసం స్పెషల్‌ రెసిపీలు మీ కోసం తీసుకొచ్చేస్తున్నాం. ఇలా రుచిగా.. సులువుగా అయిపోయే వాటిల్లో కాజు పులావ్ కూడా ఒకటి. ఈ వంటకం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా. అంతే కాదు సింపుల్‌గా త్వరగా అయిపోయింది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. చాలా తక్కువ రెసిపీలు చాలు. మరి ఈ కాజు పులావ్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

కాజు పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:

బిర్యానీ సరుకులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, బాస్మతీ రైస్, జీడిపప్పు, పుదీనా, కొత్తి మీర, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, గులాబీ రేకులు, నెయ్యి లేదా ఆయిల్.

కాజు పులావ్‌ తయారీ విధానం:

ఈ పులావ్ సాధారణ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. కానీ బాస్మతీ రైస్‌తో చేసుకుంటేనే మరింత రుచిగా ఉంటుంది. ముందుగా బాస్మతీ రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి.. ఓ అరగంట పాటు నాన బెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. క్వాంటిటీకి తగినట్టు జీడిపప్పు వేసి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ నెక్ట్స్ పుదీనా, కొత్తిమీర వేసి ఓ నిమిషం పాటు వేయించాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఆ నెక్ట్స్ కొద్దిగా పసుపు, ఉప్పు వేయాలి. ఇప్పుడు మీరు తీసుకున్న రైస్ కొలతకు నీళ్లు వేయాలి. ఆ తర్వాత బియ్యం వేసి ఒకసారి కలిపి ఉప్పు రుచి చూడండి. ఇప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలా వేసి కలిపి కుక్కర్ మూత పెట్టండి. సరిగ్గా రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి పోయాక కుక్కర్ మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కాజు పులావ్ సిద్ధం.