Honey Chilli Cauliflower: హనీ చిల్లీ కాలీఫ్లవర్.. తిన్న వాళ్లు మళ్లీ కావాలంటారు..

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 9:00 PM

మనం నిత్యం ఉపయోగించే కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. ఆరోగ్యానికి కాలీఫ్లవర్ చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాలీఫ్లవర్‌ తినడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే కాలీఫ్లవర్‌ని సరిగ్గా క్లీన్ చేయాలి. సరిగా క్లీన్ చేయకపోతే లాభాలకు బదులు నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి వీటిని సరిగ్గా క్లీన్ చేయాలి. కాలీఫ్లవర్‌తో ఎక్కువగా చాలా మంది మంచూరియా తయారు..

Honey Chilli Cauliflower: హనీ చిల్లీ కాలీఫ్లవర్.. తిన్న వాళ్లు మళ్లీ కావాలంటారు..
Honey Chilli Cauliflower
Follow us on

మనం నిత్యం ఉపయోగించే కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. ఆరోగ్యానికి కాలీఫ్లవర్ చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాలీఫ్లవర్‌ తినడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే కాలీఫ్లవర్‌ని సరిగ్గా క్లీన్ చేయాలి. సరిగా క్లీన్ చేయకపోతే లాభాలకు బదులు నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి వీటిని సరిగ్గా క్లీన్ చేయాలి. కాలీఫ్లవర్‌తో ఎక్కువగా చాలా మంది మంచూరియా తయారు చేసి ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా హనీ చిల్లీ కాలీఫ్లవర్ తయారు చేయండి. మీ ఇంట్లో వాళ్లు మీకు ఫ్యాన్ అయిపోతారు. మళ్లీ మళ్లీ ఇదే రెసిపీ చేయమని అంటారు. ఈ రెసిపీ తయారు చేయడం కూడా సింపులే. ఎక్కువ సమయం కూడా పట్టదు. సాయంత్రం పూట స్నాక్‌లా ఈ ఐటెమ్ తినొచ్చు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.

హనీ చిల్లీ కాలీఫ్లవర్‌కి కావాల్సిన పదార్థాలు:

కాలీఫ్లవర్, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చి మిర్చి, తేనె, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్, నువ్వులు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, ఆయిల్.

హనీ చిల్లీ కాలీఫ్లవర్‌ తయారీ విధానం:

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్‌ ముక్కలు, ఉప్పు, బేకింగ్ సోడా కొద్దిగా, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, కొద్దిగా నీళ్లు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాలి. ఈ ఆయిల్ వేడెక్కాక.. కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ ముక్కల్ని వేయాలి. ఇవి గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేశాక.. సన్నగా కట్ చేసి వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇవి వేగాక సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్, వెనిగర్, తేనె వేసి బాగా కలపాలి. ఇందులోనే ఓ పెద్ద స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ సాసులు మాడక ముందే కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఓ రెండు నిమిషాలు వేయించాక ఉల్లి కాడలు, కొద్దిగా నువ్వులు పైన వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే హనీ చిల్లీ కాలీఫ్లవర్‌. రుచి చాలా బాగుంటుంది. ఇందులో హనీ ఉంటుంది కాబట్టి పిల్లలకు బాగా నచ్చుతుంది.