Gutti Dondakaya: టేస్టీ గుత్తి దొండకాయ మసాలా.. ఇలా వండారంటే గిన్నెలు ఖాళీ!

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 9:15 PM

గుత్తి వంకాయ గురించి అందరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా గుత్తి వంకాయ కర్రీ చాలా ఫేమస్. వెజిటేరియన్స్‌కి ఇది కూడా ఒక ఆప్షన్. అదే విధంగా గుత్తి దొండకాయ కర్రీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. గుత్తి దొండకాయ స్టైల్‌లో చేసే ఈ వంట చాలా రుచి గాఉంటుంది. ఈ కర్రీ చపాతీ, అన్నంలో తినవచ్చు. దొండకాయ కూడా ఆరోగ్యానికి కూడా ఆరోగ్యానికి మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు దొండకాయలో లభిస్తాయి. జీర్ణ క్రియకు కూడా ఈ కర్రీ చాలా బెటర్. చాలా మందికి దొండకాయ..

Gutti Dondakaya: టేస్టీ గుత్తి దొండకాయ మసాలా.. ఇలా వండారంటే గిన్నెలు ఖాళీ!
Gutti Dondakaya
Follow us on

గుత్తి వంకాయ గురించి అందరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా గుత్తి వంకాయ కర్రీ చాలా ఫేమస్. వెజిటేరియన్స్‌కి ఇది కూడా ఒక ఆప్షన్. అదే విధంగా గుత్తి దొండకాయ కర్రీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. గుత్తి దొండకాయ స్టైల్‌లో చేసే ఈ వంట చాలా రుచి గాఉంటుంది. ఈ కర్రీ చపాతీ, అన్నంలో తినవచ్చు. దొండకాయ కూడా ఆరోగ్యానికి కూడా ఆరోగ్యానికి మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు దొండకాయలో లభిస్తాయి. జీర్ణ క్రియకు కూడా ఈ కర్రీ చాలా బెటర్. చాలా మందికి దొండకాయ అంటే ఇష్టం ఉండదు. కానీ ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే.. తినని వాళ్లు కూడా తింటారు. అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. ఇంత రుచిగా ఉండే గుత్తి దొండకాయ కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీ తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుత్తి దొండకాయకి కావాల్సిన పదార్థాలు:

దొండకాయలు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, శనగ పప్పు, నువ్వులు, యాలక్కాయ, దాల్చిన చెక్క, లవంగాలు, చింత పండు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్.

గుత్తి దొండకాయ తయారీ విధానం:

ముందుగా దొండకాయలను గుత్తి వంకాయల మాదిరి కట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కర్రీ పాన్ పెట్టాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి శనగ పప్పు, నువ్వులు, యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఒకసారి వేయించి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇది పొడిలా చేయాలి. ఆ తర్వాత మిక్సీలో ఉల్లిపాయ, అల్లం, చింత పండు, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టాలి. మళ్లీ కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. దొండకాయ ముక్కలు వేగుతుండగానే.. కరివేపాకు వేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్, పచ్చి మిర్చి వేసి మీడియం మంటపై.. పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. ఇవి బాగా వేశాక మసాలా పొడి, కారం, పసుపు, ఉప్పు, కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకూ వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుని.. దగ్గర పడ్డాక కొత్తిమీర చల్లి దించేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గుత్తి దొండకాయ కర్రీ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది.