Aritaku Fish Fry: కేరళ స్టైల్‌లో ఇలా చేపల వేపుడు చేయండి.. మళ్లీ మళ్లీ ఇలాగే చేసుకుంటారు..

కేరళ సైడ్ ఎక్కువగా చేపలే దొరుకుతాయి. దీంతో కేరళ వాళ్లు కూడా వీటినే ఎక్కువగా తింటారు. ఫిష్‌ని ఎన్నో రకాలు వండుతారు. వీటిల్లో ఫిష్ ఫ్రైలు కూడా ఒకటి. కేరళ స్టైల్‌ చేసే ఫిష్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. అలాగే ఇక్కడ ఎక్కువగా అరిటాకును వంటల్లో ఉపయోగిస్తారు. అరిటాకుతో వంటలు చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కేరళలో ఎక్కువగా ప్రసిద్ధి చెందిన వంటకాల్లో అరిటాకు ఫిష్ ఫ్రై కూడా ఒకటి. కేరళలో పండుగలు, పూజలు వంటి సందర్భాల్లో..

Aritaku Fish Fry: కేరళ స్టైల్‌లో ఇలా చేపల వేపుడు చేయండి.. మళ్లీ మళ్లీ ఇలాగే చేసుకుంటారు..
Aritaku Fish Fry
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 25, 2024 | 2:30 PM

కేరళ సైడ్ ఎక్కువగా చేపలే దొరుకుతాయి. దీంతో కేరళ వాళ్లు కూడా వీటినే ఎక్కువగా తింటారు. ఫిష్‌ని ఎన్నో రకాలు వండుతారు. వీటిల్లో ఫిష్ ఫ్రైలు కూడా ఒకటి. కేరళ స్టైల్‌ చేసే ఫిష్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. అలాగే ఇక్కడ ఎక్కువగా అరిటాకును వంటల్లో ఉపయోగిస్తారు. అరిటాకుతో వంటలు చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కేరళలో ఎక్కువగా ప్రసిద్ధి చెందిన వంటకాల్లో అరిటాకు ఫిష్ ఫ్రై కూడా ఒకటి. కేరళలో పండుగలు, పూజలు వంటి సందర్భాల్లో అరటి ఆకును ఉపయోగించి వండటం సంప్రదాయంగా ఉపయోగిస్తారు. ఇలాగే ఫిష్ ఫ్రై కూడా చేస్తారు. మరి ఈ అరిటాకు ఫిష్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అరిటాకు ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

మీకు ఇష్టమైన చేపలు లేదా చేప ముక్కలు, అరిటాకులు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం.

అరిటాకు ఫిష్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లులి రెబ్బలు, ఎండు మిర్చి వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని బాగా కడిగి.. ముక్కలు లేదా చేపలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత ముక్కలపై కొత్తిమీర, నిమ్మరసం వేసి వేయండి. ఇలా మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అరిటాకును ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేయాలి. ఆ ఆకులకు కొద్దిగా నూనె రాసి.. అందులో చేప లేదా చేప ముక్కలు పెట్టి కట్టాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇందులో అరిటాకు పొట్లాలను వేసి వేడి చేయాలి. ఇవి బంగారు రంగులోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా అరిటాకు ఫిష్ ఫ్రై సిద్ధం. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. కాస్త లేటు అయినా రుచి మాత్రం చాలా బావుంటుంది.

కేరళ స్టైల్‌లో ఇలా చేపల వేపుడు చేయండి.. ఎప్పుడూ ఇలానే చేసుకుంటారు
కేరళ స్టైల్‌లో ఇలా చేపల వేపుడు చేయండి.. ఎప్పుడూ ఇలానే చేసుకుంటారు
సూపర్‌ఫాస్ట్ రైళ్లలో రెడ్ కలర్‌ బోగీలు ఎందుకు ఉంటాయో తెలుసా?
సూపర్‌ఫాస్ట్ రైళ్లలో రెడ్ కలర్‌ బోగీలు ఎందుకు ఉంటాయో తెలుసా?
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
పవర్ స్టార్ కలిసిన నిర్మాతలు.. పవన్ సినిమాలకు సిద్ధంగా ఉన్నారా.?
పవర్ స్టార్ కలిసిన నిర్మాతలు.. పవన్ సినిమాలకు సిద్ధంగా ఉన్నారా.?
మత్తు కళ్ళతో మంత్ర ముగ్ధులను చేస్తున్న అనసూయ..
మత్తు కళ్ళతో మంత్ర ముగ్ధులను చేస్తున్న అనసూయ..
రూ. 8వేలలో సూపర్‌ ఫీచర్స్‌.. వివో నుంచి కళ్లు చెదిరే ఫోన్‌
రూ. 8వేలలో సూపర్‌ ఫీచర్స్‌.. వివో నుంచి కళ్లు చెదిరే ఫోన్‌
నెట్టింట గత్తరలేపుతోన్న 'రంగబలి' హీరోయిన్..
నెట్టింట గత్తరలేపుతోన్న 'రంగబలి' హీరోయిన్..
పోర్ట్‌లోభారీ పైథాన్.. అమ్మో.. కార్మికుల పరుగో పరుగు..
పోర్ట్‌లోభారీ పైథాన్.. అమ్మో.. కార్మికుల పరుగో పరుగు..
ఎన్ని సినిమాలు వస్తేనేం... నా రాక నాదే.. తేజకి థియేటర్లు దక్కేనా?
ఎన్ని సినిమాలు వస్తేనేం... నా రాక నాదే.. తేజకి థియేటర్లు దక్కేనా?
కాకరకాయ కొబ్బరి కారం.. తిన్నవాళ్లు వావ్ అనాల్సిందే..
కాకరకాయ కొబ్బరి కారం.. తిన్నవాళ్లు వావ్ అనాల్సిందే..
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
హమ్మయ్య.. రవితేజ సేఫ్‌.! | శృంగార సీన్లు లీక్‌.! షాక్‌లో హీరోయిన్
హమ్మయ్య.. రవితేజ సేఫ్‌.! | శృంగార సీన్లు లీక్‌.! షాక్‌లో హీరోయిన్
కుటుంబాల మద్య చిచ్చు పెట్టిన ప్రేమ వ్యవహారం.. కర్రలతో బీభత్సం
కుటుంబాల మద్య చిచ్చు పెట్టిన ప్రేమ వ్యవహారం.. కర్రలతో బీభత్సం
శ్రీశైలం డ్యామ్‌కు ఎమర్జెన్సీ సైరన్.. ఏ క్షణమైనా గేట్లను..
శ్రీశైలం డ్యామ్‌కు ఎమర్జెన్సీ సైరన్.. ఏ క్షణమైనా గేట్లను..