కళ్లు పసుపు రంగులోకి మారితే లివర్ సమస్య ఉన్నట్లు అనుమానించాలని నిపుణులు చెబుతున్నారు. హైపటైటిస్, కామెర్లు వంటి అనారోగ్య సమస్యల కారణంగానే కళ్లు పసుపు రంగులోకి మారుతాయి.
కడుపులో నిత్యం అసౌకర్యంగా ఉన్నా, వాంతి వస్తున్నట్లు భావన కలిగినా.. మీ లివర్‌లో ఏదో ఒక సమస్య ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
లివర్‌లో అనారోగ్య సమస్యలు తలెత్తితే.. నోటి దుర్వాసన కూడా వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నోటి శుభ్రత పాటించినా దుర్వాసన వస్తుంటే లివర్‌లో సమస్య ఉందని భావించాలి.
మూత్రం రంగులో మార్పు వస్తే కిడ్నీ, లివర్‌లో సమస్యలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబతున్నారు. పచ్చ రంగులోకి మూత్రం మారితే లివర్ సమస్యగా భావించాలని చెబుతున్నారు.
ఇక కాళ్లలో, చేతుల్లో హఠాత్తుగా వాపు కనిపిస్తే.. లివరస్ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం చేసుకోవచ్చు. శరీరంలో శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని సందర్భాల్లో లివర్ పనితీరు బాగాలేకపోతే.. ఆకలి లేకపోవడం, బలహీనత, నిద్రలేమి వంటి సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఉన్నపలంగా బరువు తగ్గుతున్నా, మల విసర్జన నల్లగా ఉండడం, రోజంతా అలసటగా ఉన్నా.. లివర్ ఆరోగ్యం పాడవుతుందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.