Korra Cutlet: కొర్రలతో కట్ లెట్.. టేస్ట్ అదిరి పోతుంది..

| Edited By: Shaik Madar Saheb

Jul 30, 2024 | 8:51 PM

కట్ లెట్స్ అంటే చాలా మందికి ఇష్టం. వీటిని వెజ్ అండ్ నాన్ వెజ్‌తో కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. సాస్, మయనీస్, పుదీనా చట్నీతో తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. ఎంత రుచిగా ఉన్నా వీటిని ఎక్కువ తింటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉండవు. కానీ వీటిని కూడా ఆరోగ్యంగా తినవచ్చు. కొర్రలతో కలిపి కట్ లెట్స్ తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం..

Korra Cutlet: కొర్రలతో కట్ లెట్.. టేస్ట్ అదిరి పోతుంది..
Korra Cutlet
Follow us on

కట్ లెట్స్ అంటే చాలా మందికి ఇష్టం. వీటిని వెజ్ అండ్ నాన్ వెజ్‌తో కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. సాస్, మయనీస్, పుదీనా చట్నీతో తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. ఎంత రుచిగా ఉన్నా వీటిని ఎక్కువ తింటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉండవు. కానీ వీటిని కూడా ఆరోగ్యంగా తినవచ్చు. కొర్రలతో కలిపి కట్ లెట్స్ తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయి. వీటిని పెద్దలు, పిల్లలు, వృద్ధులు ఎవరైనా తినవచ్చు. మరి ఈ కొర్రల కట్ లెట్స్‌‌కి ఎలాంటి పదార్థాలు కావాలి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

కొర్రల కట్ లెట్స్‌కి కావాల్సిన పదార్థాలు:

కొర్రలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, బియ్యం, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, ఆయిల్.

కొర్రల కట్ లెట్స్‌ తయారీ విధానం:

ముందుగా కొర్రలను, బియ్యాన్ని కలిపి ఐదు గంటలకు పైగానే నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి గట్టిగా రుబ్బుకోండి. ఇందులో చికెన్ కూడా కలుపుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే.. క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడక పెట్టుకోవాలి. ఇందులో వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా మిక్స్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత మీకు నచ్చిన షేప్స్‌లో చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్‌లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకుని ఈ కట్‌ లెట్స్ అందులో వేసి చిన్న మంట మీద.. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి బాగా వేగాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కొర్రల కట్ లెట్స్ సిద్ధం. వీటిని టమాటా సాస్, పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.