ఇడ్లీ పిండిని పర్‌ఫెక్ట్ గా తయారుచేయడం ఎలా ? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే

|

Jan 16, 2025 | 4:57 PM

ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. నాణ్యమైన మినపప్పు, సరైన కొలతల్లో బియ్యం కలపడం ముఖ్యం. మినపప్పును 2-3 గంటలు నానబెట్టి ముందుగా రుబ్బాలి. బియ్యాన్ని గట్టిగా రుబ్బడం మంచిది. పిండిని కనీసం 8 గంటలపాటు పులువనివ్వాలి. బియ్యం నానబెట్టిన నీటిని రుబ్బడంలో వాడితే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఇడ్లీ 3-4 నిమిషాల్లో ఆవిరిలోనే ఉండాలి. ఎక్కువ సమయం పెడితే గట్టిగా అవుతాయి. ఈ సూచనలు పాటిస్తే ఇడ్లీలను సాఫ్ట్ గా, మెత్తగా తయారు చేసుకోవచ్చు.

ఇడ్లీ పిండిని పర్‌ఫెక్ట్ గా తయారుచేయడం ఎలా ? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే
Idlly Preparation
Follow us on

మనలో చాలా మందికి ఇడ్లీ చేయడంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఈ పొరపాట్ల కారణంగా ఇడ్లీ గట్టిగా అవుతుంటాయి. ఇడ్లీ సాఫ్ట్ గా, మెత్తగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. మీరు అనుకున్నట్లు వస్తాయి. ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడ్లీ సాఫ్ట్ గా రావాలంటే మంచి నాణ్యమైన మినపప్పు అవసరం. ఆ మినపపప్పు తాజాగా ఉండాలి. కొంతమంది ఇడ్లీకి సోడా వేస్తుంటారు. ఇలా చేయకూడదు. సోడా అవసరం లేకుండానే మంచి ఇడ్లీని మీరు చేసుకోవచ్చు. సోడా వేయడం వల్ల మాత్రం ఇడ్లీ రుచిని మార్చేస్తుంది.

మినపప్పును 2-3 గంటలే నానబెట్టాలి. ఎక్కువ సమయం నానబెట్టినా.. తక్కువ సమయం ఉంచినా ఇడ్లీ సాఫ్ట్ గా ఉండవు. మినపప్పు 1 కప్పు అయితే బియ్యం 4 కప్పులు కలుపుకోవాలి. ఇదే సరైన కొలత. మినపప్పును ముందుగా రుబ్బాలి. తర్వాత బియ్యాన్ని రుబ్బడం చేయాలి. మినపప్పు రుబ్బేటప్పుడు నీరు కొద్ది కొద్దిగా కలుపుతూ రుబ్బాలి. ఒక్కసారిగా నీరు పోస్తే మినపపప్పు సరిగ్గా రుబ్బుకోదు. మినపప్పును క్రీమ్ మాదిరిగా మెత్తగా రుబ్బాలి. ఒక విధంగా చెప్పాలంటే రుబ్బిన ఈ మినపప్పును కప్పు వాటర్ లో వేస్తే అది పైకి తేలాలి అప్పుడు ఇడ్లీలు సాఫ్ట్ గా వస్తాయి. బియ్యాన్ని కూడా బాగా మెత్తగా కాకుండా కాస్త గట్టిగా రుబ్బాలి. ఇది ఇడ్లీకి మంచి దృఢత్వాన్ని ఇస్తుంది. బియ్యం నానబెట్టిన నీటినే ఉపయోగిస్తే ఇంకా బాగుంటుంది.

ఇడ్లీ సాఫ్ట్ గా రావాలంటే రుబ్బిన ఈ ఇడ్లీ పిండిని కనీసం 8 గంటలపాటు పులువనియ్యాలి. అంత సమయం లేకపోతే ఇడ్లీ గట్టిగా తయారవుతుంది. మీరు అనుకున్నట్లు సాఫ్ట్ గా రావు. ఇడ్లీ కేవలం 3-4 నిమిషాల్లోనే ఆవిరిలో ఉడుకుతుంది. ఎక్కువ సమయం పెట్టడం వల్ల ఇడ్లీ గట్టిపడిపోతుంది. కనుక సరైన సమయానికి అవి తీసేయాలి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇడ్లీ చెక్కుచెదరకుండా మంచిగా సాఫ్ట్ గా, మెత్తగా, రుచిగా ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా పర్‌ఫెక్ట్ ఇడ్లీ పిండి తయారు చేసి అందరిని మెప్పించండి.