Fried Bun: ఫ్రైడ్ బన్స్ ని ఇక పై ఇంట్లోనే సింపుల్ గా చేయండిలా!

పిల్లలు, పెద్దలూ ఎంతో ఇష్టంగా తినే వాటిల్లో ఫ్రైడ్ బన్స్ కూడా ఒకటి. ఇవి ఎంతో స్వీట్ గా ఉంటాయి. అందుకే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చాలా మంది వీటిని బయటనే తిని ఉంటారు. కానీ ఇంట్లో కూడా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా పోటీ పడి మరీ తింటారు. ఇంట్లో ఒక్కసారి వీటిని చేశారంటే.. అందరూ ఎంతగానో ఇష్టపడి తింటారు. మరి ఈ ఫ్రైడ్ బన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేయాలన్న వివరాలను..

Fried Bun: ఫ్రైడ్ బన్స్ ని ఇక పై ఇంట్లోనే సింపుల్ గా చేయండిలా!
Fried Bun
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 24, 2023 | 5:00 PM

పిల్లలు, పెద్దలూ ఎంతో ఇష్టంగా తినే వాటిల్లో ఫ్రైడ్ బన్స్ కూడా ఒకటి. ఇవి ఎంతో స్వీట్ గా ఉంటాయి. అందుకే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చాలా మంది వీటిని బయటనే తిని ఉంటారు. కానీ ఇంట్లో కూడా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా పోటీ పడి మరీ తింటారు. ఇంట్లో ఒక్కసారి వీటిని చేశారంటే.. అందరూ ఎంతగానో ఇష్టపడి తింటారు. మరి ఈ ఫ్రైడ్ బన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేయాలన్న వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఫ్రైడ్ బన్ కి తయారీకి కావాల్సిన పదార్థాలు:

పాలు, ఈస్ట్, మైదా పిండి, నూనె, పంచదార, ఉప్పు.

ఇవి కూడా చదవండి

కొబ్బరి మిశ్రమానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్:

బెల్లం, పచ్చి కొబ్బరి, టూటీ ఫ్రూటీ, యాలకులు, జీడి పప్పు.

ఫ్రైడ్ బన్ తయారీ విధానం:

ముందుగా ఒక లోతైన గిన్నె తీసుకుని.. అందులో గోరు వెచ్చటి పాలను తీసుకోవాలి. ఇందులో పంచదార, ఈస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిపై మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వీటిలో గోరు వెచ్చటి నీళ్లు లేదా కావాల్సిన వాళ్లు పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. నెక్ట్స్ దీనిపై నూనె రాసి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి.

ఈలోపు ఒక మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి ముందు మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో జీడి పప్పు, ట్రూటీ ఫ్రూటీ వేసి కలుపు కోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పిండిని తీసుకుని మరోసారి అంతా కలుపుకుని కొద్దిగా పిండిని తీసుకోవాలి. చేతికి నూనె రాసుకుంటూ ముందుగా గిన్నె లాగా వత్తుకోవాలి.

ఇలా చేసుకున్న పిండిలో కొబ్బరి ఉండ పెట్టుకుని అంచులను మూసి వేయండి. తర్వాత దీనిని గుండ్రంగా వచ్చేలా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఫ్రైడ్ బన్ రెడీ. వీటిని ఓవెన్ లో కూడా బేక్ చేసుకోవచ్చు. 180 డిగ్రీల వద్ద 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వీటిని బేక్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే