Eye Brows at Home: ఐబ్రోస్ తీయించడానికి పార్లర్‌కు వెళ్లాల్సిన పని లేదు.. సింపుల్ ట్రిక్స్ ఇవిగో!

|

Aug 12, 2024 | 1:43 PM

ముఖంలో ఎదుటి వారిని ఎక్కువగా ఆకర్షించే వాటిల్లో కళ్లు కూడా ఉంటాయి. కళ్లు అందంగా ఉంటే మనం మాట్లాడాల్సిన పని లేదు. కళ్లతోనే సమాధానం ఇవ్వొచ్చు. అలాంటి కళ్లను మరింత అందంగా మార్చడంలో ఐబ్రోస్ మరింత హెల్ప్ చేస్తాయి. మరి ఐబ్రోస్‌ని మంచి షేపులోకి తీసుకు రావాలంటే.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిందే. ఐబ్రోస్ చేసేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. ఇంకొంత మంది చాలా భయ పడిపోతారు. మరి కొంత మంది ఇంకా..

Eye Brows at Home: ఐబ్రోస్ తీయించడానికి పార్లర్‌కు వెళ్లాల్సిన పని లేదు.. సింపుల్ ట్రిక్స్ ఇవిగో!
Eye Brows At Home
Follow us on

ముఖంలో ఎదుటి వారిని ఎక్కువగా ఆకర్షించే వాటిల్లో కళ్లు కూడా ఉంటాయి. కళ్లు అందంగా ఉంటే మనం మాట్లాడాల్సిన పని లేదు. కళ్లతోనే సమాధానం ఇవ్వొచ్చు. అలాంటి కళ్లను మరింత అందంగా మార్చడంలో ఐబ్రోస్ మరింత హెల్ప్ చేస్తాయి. మరి ఐబ్రోస్‌ని మంచి షేపులోకి తీసుకు రావాలంటే.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిందే. ఐబ్రోస్ చేసేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. ఇంకొంత మంది చాలా భయ పడిపోతారు. మరి కొంత మంది ఇంకా సెన్సిటీవ్‌గా ఉంటుంది. ఇలాంటి వారికి స్కిన్ ఎర్రగా అయిపోవడం, స్కిన్ కట్ అయిపోవడం జరుగుతుంది. ఒక రోజంతా మంటగా అనిపిస్తుంది. కానీ ఇకపై ఆ నొప్పిని భరించలేనవసరం లేదు. ఐబ్రోస్ చేయించడానికి పార్లర్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే కొన్ని మార్గాలను ఫాలో అవ్వొచ్చు. మరి ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ట్వీజింగ్:

చాలా మందికి ట్వీజర్లు అంటే తెలీదు. వీటితో కూడా ఐబ్రోకు మంచి షేప్ తీసుకు రావచ్చు. త్రెడింగ్ కన్నా.. ట్వీజర్ వాడితే నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటికి నొప్పి, మంట కూడా ఏమీ ఉండదు.

ఐబ్రో వ్యాక్సింగ్:

వ్యాక్సింగ్ అంటే కాళ్లకు, చేతులకు చేసే వ్యాక్సింగ్ కాదు. అలాంటి వ్యాక్సింగ్ ఐబ్రోలకు వాడితే ఇంకేమన్నా ఉందా.. వాటికి బుధులుగా ఇప్పుడు ప్రత్యేకంగా ఐబ్రో వ్యాక్సింగ్ స్ట్రిప్స్ వచ్చాయి. ఐబ్రోస్ పక్కన స్టిక్కర్‌లా అతికించి.. ఒకసారి లాగేస్తే చాలు.. ఐబ్రోలు మంచి ఆకారంలోకి వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఐబ్రో స్టెన్సిల్స్:

పార్లర్స్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా ఐబ్రో చేయడంలో స్టెన్సిల్స్ కూడా చక్కగా పని చేస్తాయి. ఐబ్రో మీద అచ్చు లాగా పెట్టి.. ఐబ్రో పెన్సిల్ లేదా ఐ షాడో వాడితే మంచి ఆకారం వస్తుంది. కనుబొమ్ము సన్నగా ఉండేవారు ఇది ట్రై చేయవచ్చు. ఫంక్షన్స్ వంటి వాటికి ఇది చక్కగా పని చేస్తుంది.

ఐబ్రో గ్రూమింగ్ కిట్స్:

ఇది ఒక్క కిట్ తెచ్చుకుంటే చాలు. వీటిల్లో ఐబ్రో షేపింగ్ కోసం అవసరం అయ్యేవన్నీ ఉంటాయి. వీటితో ఎప్పటికప్పుడు ఇంట్లోనే మీరు కనుబొమ్మలను షేప్ చేసుకోవచ్చు.

నంబింగ్ క్రీమ్:

చాలా మందికి ఇతరవి వాడాలన్నా చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే వాటితో ఉన్న ఐబ్రోస్ కూడా చెడిపోతాయని భయ పడతారు. అలాంటి వారు ఐబ్రో చేయించు కోవడానికి పార్లర్‌కు వెళ్లినప్పుడు.. నంబింగ్ క్రీమ్ ఉపయోగించడండి. ఈ క్రీమ్ వాడటం వల్ల ఐ బ్రోస్ మొద్దు బారిపోయినట్టులు ఉంటాయి. దీంతో త్రెడింగ్ చేసినా మీకు ఎలాంటి నొప్పి ఉండదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..