Weight loss: త్వరగా బరువు తగ్గాలా.? 2-2-2 విధానాన్ని ఫాలో అవ్వండి..

తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం కారణం ఏదైనా.. ఇటీవల ఊబకాయం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్కూల్‌కి వెళ్లే చిన్నారులు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఊబకాయం కారణంగా డయాబెటిస్‌, గుండె సంబంధిత సమస్యలు వంటివి వెంటాడుతున్నాయి. దీంతో చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నారు...

Weight loss: త్వరగా బరువు తగ్గాలా.? 2-2-2 విధానాన్ని ఫాలో అవ్వండి..
Weight Loss
Follow us

|

Updated on: Jul 28, 2024 | 11:31 AM

తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం కారణం ఏదైనా.. ఇటీవల ఊబకాయం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్కూల్‌కి వెళ్లే చిన్నారులు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఊబకాయం కారణంగా డయాబెటిస్‌, గుండె సంబంధిత సమస్యలు వంటివి వెంటాడుతున్నాయి. దీంతో చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం గంటల తరబడి వర్కవుట్స్‌ చేస్తున్నారు. అయితే ఎన్ని రకాలు ప్రయత్నించిన బరువు తగ్గని వారికి పరిశోధకులు ఒక మంచి టెక్నిక్‌ గురించి చెబుతున్నారు. అదే 2-2-2 విధానం. ఇంతకీ ఏంటా విధానం.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఊబకాయం సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌లో కుస్తీలు పడుతుంటారు. వాకింగ్‌, రన్నింగ్ పేరుతో పరిగెడుతుంటారు. అయితే పరిశోధకులు ఒక సింపుల్ టెక్నిక్‌ను చెబుతున్నారు. 2-2-2 విధానాన్ని పాటించడం ద్వారా వేగంగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు. ఈ విధానంలో భాగంగా జీవనశైలిలో మూడు రకాల మార్పులు చేసుకోవాలి. ఇంతకీ ఆ మార్పులు ఏంటంటే..

* మూడు 2లో మొదటిది.. రోజుకు రెండు రకాల పండ్లను తీసుకోవడం. ప్రతీరోజూ కచ్చితంగా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్, బెర్రీస్‌ వంటి విటమిన్స్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. పండ్లను తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గొచ్చని ఇప్పటికే చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

* ఇక మరో మార్పు రోజు కచ్చితంగా రెండు రకాల కూరగాయలను తీసుకోవాలి. ఉదయం ఒక రకం, రాత్రి మరో రకం కూరగాయను డైట్‌లో భాగం చేసుకోవాలి. అయితే అన్నంతో కంటే చపాతీలతో తీసుకుంటే మంచిది. ముఖ్యంగా బచ్చలికూర, బ్రోకలీ, క్యారెట్ వంటి కూరగాయలను తీసుకోవడం మంచిది. వీటిలో ఫైబర్‌ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో త్వరగా బరువు తగ్గొచ్ు.

* అలాగే కచ్చితంగా ప్రతీరోజూ రెండు లీటర్ల నీటిని తీసుకోవాలి. తగినంత నీరు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భోజనం చేసే రెండు గంటల ముందు రెండు లీటర్ల నీటిని తీసుకుంటే అతిగి తినడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు. వీటితోపాటు రోజూ కచ్చితంగా వాకింగ్ చేయడాన్ని కూడ అలవాటు చేసుకోవాలి. ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా బరువు ఇట్టే తగ్గొచ్చని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

త్వరగా బరువు తగ్గాలా.? 2-2-2 విధానాన్ని ఫాలో అవ్వండి..
త్వరగా బరువు తగ్గాలా.? 2-2-2 విధానాన్ని ఫాలో అవ్వండి..
ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారా?
ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారా?
ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క
ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క
ప్రభాస్ సరసన పాకిస్థాన్ హీరోయిన్..
ప్రభాస్ సరసన పాకిస్థాన్ హీరోయిన్..
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు
ఐదేళ్లు చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్..
ఐదేళ్లు చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్..
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ప్రోఫైల్‌ ఫోటో అప్‌డేడ్‌ కాలేదా? ఇలా చేయండి
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ప్రోఫైల్‌ ఫోటో అప్‌డేడ్‌ కాలేదా? ఇలా చేయండి
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
పవర్‌ ఫుల్‌ ప్రాసెసర్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? టాప్‌ 5 ఫోన్స్‌
పవర్‌ ఫుల్‌ ప్రాసెసర్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? టాప్‌ 5 ఫోన్స్‌
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి