ఇదేందయ్యా ఇది.. చేతిలో గొడుగు.. రైలు నడుపుతున్న లోకో ఫైలట్
TV9 Telugu
28 July 2024
వర్షాలకు శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నీరు కారడం చూసే ఉంటాం. అలాగే రైల్వే ట్రాక్‌లు కూడా నీటిలో మునగడం చూసి ఉంటారు.
ట్రైన్ సీలింగ్ నుంచి నీరు కారడం ఎప్పడైనా చూశారా..? ఏకంగా లోకో పైలట్ క్యాబిన్‌లో వర్షం నీరు పడటం చూశారా?
ట్రైన్ నడిపే లోకోపైలెట్‌కే ఇలాంటి అనుభవం ఎదురైతే కొన్ని వందల మంది ప్రయాణికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గొడుగు పట్టుకుని రైలు నడిపిన లోకో ఫైలట్‌కు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక చేత్తో గొడగు పట్టుకోని మరో చేత్తో లోకో పైలట్ రైలు నడుపుతున్నారు. అతను తడవకుండా గొడుగు అడ్డం పెట్టుకొని, ట్రైన్ నడిపించాడు.
విషయం రైల్వే బోర్డుకు తెలిస్తే.. సస్పెండ్ చేస్తారన్న భయంతో పైలెట్ ముఖం చూపించడం లేదు. రైలు నంబర్‌ను కూడా చూపించలేదు.
వాన కాలంలో రైల్లో పరిస్థితులు చూపించడానికి.. వీడియో రికార్డు చేశారని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఇది జరిగింది భారత్‌కు చెందిన ట్రైన్ లోన లేక బంగ్లాదేశ్ లాంటి ఇతర దేశాల ట్రైన్ అనేది తెలియాల్సి ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి