Wash New Cloths: కొత్త బట్టలను ఉతకకుండానే వేసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది!

|

Oct 12, 2023 | 12:46 PM

కొత్త బట్టలంటే ఎవరికి ఇష్టం ఉండదు. కొత్త బట్టలు కొనడమన్నా.. వేసుకోవడమన్నా అందరికీ ఇష్టమే. అందులోనూ పండుగ సీజన్లలో పెట్టే ఆఫర్లతో అస్సలు కొనకుండా ఉండలం. ముఖ్యంగా లేడీస్ అయితే ఏది కొనాలో తెలియక తర్జన భర్జన పడుతూంటారు. అన్ని ఆఫర్లు ఉంటాయి. ఇక ఎలాగో మనకు కావాలిగా.. ఎలాగో ఆఫర్లలో ఉన్నాయి. ఇలా వేరే వేరే ఆకేషన్స్ కి కూడా ముందుగానే కొని దాచి పెడుతూంటారు. ఇక ఆ కొత్త బట్టలను ఎప్పుడు వేసుకుందామా.. మన ఫ్యాషన్ ని అందరికీ..

Wash New Cloths: కొత్త బట్టలను ఉతకకుండానే వేసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది!
New Cloths
Follow us on

కొత్త బట్టలంటే ఎవరికి ఇష్టం ఉండదు. కొత్త బట్టలు కొనడమన్నా.. వేసుకోవడమన్నా అందరికీ ఇష్టమే. అందులోనూ పండుగ సీజన్లలో పెట్టే ఆఫర్లతో అస్సలు కొనకుండా ఉండలం. ముఖ్యంగా లేడీస్ అయితే ఏది కొనాలో తెలియక తర్జన భర్జన పడుతూంటారు. అన్ని ఆఫర్లు ఉంటాయి. ఇక ఎలాగో మనకు కావాలిగా.. ఎలాగో ఆఫర్లలో ఉన్నాయి. ఇలా వేరే వేరే ఆకేషన్స్ కి కూడా ముందుగానే కొని దాచి పెడుతూంటారు. ఇక ఆ కొత్త బట్టలను ఎప్పుడు వేసుకుందామా.. మన ఫ్యాషన్ ని అందరికీ ఎప్పుడు చూపిస్తామా అని మనసు ఉవ్విళ్లూరుతూనే ఉంటుంది.

కొన్నవి.. వేసుకునే దాకా ఆగలేం. ఈ మధ్యలోనే ట్రయల్స్ రెడీ అయిపోతాయి. అయితే ఒక్కడే చాలా మంది తప్పులు చేస్తూంటారు. కొత్త బట్టలను నేరుగా వేసేసుకుంటారు. చాలా మంది ఇంతే. కొత్త బట్టలను వాష్ చేయకుండా నేరుగా వేసుకుంటారు. ఇలా వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయం ఎవరికీ తెలీదు. ఏంటి షాక్ అవుతున్నారా.. ఇది నిజం. తరుచుగా అందరూ చేసేది ఇది. కొన్న బట్టలను ఇంటికి వచ్చిన వెంటనే ధరించేస్తారు. ఇలా చేయడం తప్పుని.. దీని వల్ల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులను ఎదుర్కొనాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ట్రయల్స్ వేయడం:

ఇవి కూడా చదవండి

భారత దేశంలో మాత్రం ఎక్కడైనా.. కొత్త బట్టలను అస్సలు ఉతకరు. ఇదేదో అపచారంగా భావిస్తారు. కానీ ఇది తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ లేదా నేరుగా బట్టల షాపులకు వెళ్లి కొనుగోలు చేయాలంటే.. ట్రయల్స్ తప్పనిసరి అయింది. దీంతో రక రకాల వాటిని ట్రయల్స్ వేసి.. మొత్తానికి ఏదో ఒకటి తీసుకుంటారు. అయితే మీరిక్కడ ఒక విషయం మర్చి పోతున్నారు. అక్కడ ట్రయల్ వేసుకుని వదిలేసిన వాటిని మళ్లీ తిరిగి సర్ది రాక్స్ పెడతారు. మళ్లీ వాటిని ఎవరెవరో ట్రయల్స్ వేస్తూ ఉంటారు. ఇలాంటి రకమైన దుస్తులు ధరించడం వల్ల చర్మ వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కొత్త బట్టల్లో బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు:

మనం వాటిని కొత్త బట్టలే అనుకుంటాం కానీ.. వాటిని కింద పడేస్తూంటారు. అంతేకాదు రవాణా సమయంలో కూడా ఎలాంటి భద్రతా చర్లయు ఉండవు. ఎక్కడెక్కడో నిల్వ చేస్తారు. భద్ర పరిచే ప్లేస్ క్లీన్ గా ఉన్నాయో లేవో మనకు తెలీదు. ప్యాకింగ్ సమయంలో కూడా కింద పెట్టవచ్చు. ఇలా అనేక చేతులు మారి కొత్త బట్టలు తయారవుతాయి. కాబట్టి వీటిపై బ్యాక్టీరియా, సూక్ష్మీ జీవులు తప్పకుండా ఉంటాయి. అందుకే కొత్త బట్టలను యూజ్ చేసే ముందు ఒకసారి వాస్ చేసుకుని వాడాలి.

బట్టలు తయారు చేయడానికి వాడే రసాయనాలు:

బట్టలను తయారు చేయడానికి అనేక రసాయనాలను యూజ్ చేస్తూంటారు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా రెడీమెడ్ బట్టలు ఎక్కువగానే లభ్యం అవుతున్నాయి. వీటి తయారీలో వివిధ రంగులు, ఇతర రసాయనాలను ఉపయోగించి ఉంటారు. బట్టలను కొన్ని సార్లు పాలిష్ చేయడంలో, ప్రింటింగ్ చేయడంలో ఇలా వాటిలో అనేక రసాయనాలను ఉపయోగిస్తారు. కాబట్టి కొత్త బట్టలు ఎంత క్లీన్ గా ఉన్నా.. వాటిని ఒకసారి వాష్ చేయడం మంచిది.

కొత్త బట్టలు దురదను కలిగిస్తాయి:

ఒక విషయం గమనించండి. కొత్త బట్టలను ఎప్పుడైనా వేసుకున్నాక.. దురద, చిరాకుగా ఉంటాయి. దానికి కారణం వాటిలో ఉండే బ్యాక్టీరియా. అలాగే కొత్త బట్టలు చమటను, నీటిని ఎక్కువగా గ్రహించలేవు.

పిల్లలు, గర్భిణీలు కొత్త బట్టల వల్ల ప్రమాదం:

పిల్లలు, గర్భి ణీలు కొత్త బట్టలను వేసుకోవాలనుకుంటే.. ఖచ్చితంగా వాటిని వాష్ చేసే ధరించాలి. దీని వల్ల వారికి సౌకర్యవంతంగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. లేకుంటే వైరల్ ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.