Collagen Foods: ఈ ఆహారాలు తిన్నారంటే.. కొల్లాజెన్ పెరిగి ఎంతో అందంగా కనిపిస్తారు..

|

Aug 09, 2024 | 7:19 PM

అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందంగా కనిపించడం కోసం ఎన్నో కాస్మెటిక్స్ ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంట్లో రెమిడీలు పాటిస్తారు. అలాగే బ్యూటీ పార్లర్‌కు కూడా వెళ్తూ ఉంటారు. ఎన్ని చేసినా సరైన ఆహారం తీసుకుంటేనే లోపల నుంచి ఇంకా అందంగా కనిపించగలం. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం వల్ల అందంగా కనిపించవచ్చు. ముఖ్యంగా స్కిన్ యంగ్‌గా, ముడతలు లేకుండా..

Collagen Foods: ఈ ఆహారాలు తిన్నారంటే.. కొల్లాజెన్ పెరిగి ఎంతో అందంగా కనిపిస్తారు..
Collagen Foods
Follow us on

అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందంగా కనిపించడం కోసం ఎన్నో కాస్మెటిక్స్ ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంట్లో రెమిడీలు పాటిస్తారు. అలాగే బ్యూటీ పార్లర్‌కు కూడా వెళ్తూ ఉంటారు. ఎన్ని చేసినా సరైన ఆహారం తీసుకుంటేనే లోపల నుంచి ఇంకా అందంగా కనిపించగలం. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం వల్ల అందంగా కనిపించవచ్చు. ముఖ్యంగా స్కిన్ యంగ్‌గా, ముడతలు లేకుండా ఉంచేందుకు కొల్లాజెన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మహిళలకు అయినా, పురుషులకు అయినా 30 ఏళ్లు దాటిన తర్వాత కొల్లాజెన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది. దీని వల్ల చాలా మందిలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. వయసు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ కొల్లాజెన్ ఉత్పత్తి చేసే ఆహారాల తీసుకుంటే మాత్రం వయసు పెరిగినా కూడా యవ్వనంగా కనిపించవచ్చు. మరి కొల్లాజెన్ ఉండే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాలు ఇవే:

పాల ఉత్పత్తులు:

కొల్లాజెన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తూ, కాంతివంతంగా మెరుస్తుంది. చికెన్, చేపలు, బీన్స్, పాలు, పాల ఉత్పత్తుల్లో కొల్లాజెన్ అనేది మెండుగా ఉంటుంది.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి సిట్రెస్ పండ్లను రెగ్యులర్‌గా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

బెర్రీస్:

బెర్రీ జాతికి చెందిన పండ్లలో కూడా కొల్లాజెన్ ఉత్పత్తి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే పండ్లలో ఇవి ముందు ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కొల్లాజెన్ ఉత్పత్తికి బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ బెర్రీస్ వంటివి తినవచ్చు.

వెల్లుల్లి:

వెల్లుల్లితో కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. వెల్లుల్లి తినడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అదే విధంగా జీడిపప్పులో కూడా కొల్లాజెన్ లభ్యమవుతుంది. ఇది కూడా తీసుకోవచ్చు.

ఆకు కూరలు:

ఆకు కూరల్లో కూడా కొల్లాజెన్ లభ్యమవుతుంది. అంతే కాకుండా ఇందులో చర్మానికి అవసరమైన విటమన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్, ఫోలేట్ లభిస్తాయి. ఇవి చర్మాన్ని అందంగా మార్చడంలో, చర్మాన్ని రక్షించడంలో చక్కగా హెల్ప్ చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..