Pickles in Monsoon: ఇది విన్నారా.. వర్షా కాలంలో ఆవకాయ అస్సలు తినకూడదట!

|

Aug 11, 2024 | 4:35 PM

వర్షా కాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ కాలంలో వేడి వేడిగా, కారంగా ఉండే ఆహారాలు తినాలనిపిస్తుంది. అందుకే చాలా మంది మిరపకాయ బజ్జీలు, పకోడీలు, ఇతర స్నాక్స్ చేసుకుని తింటూ ఉంటారు. ఇక వేసవిలో పెట్టిన పచ్చళ్లు అన్నీ ఈ సీజన్‌లో సేల్ అవుతాయి. వేడి వేడిగా అన్నం వండుకుని.. అందులో పచ్చళ్లు వేసుకుని హ్యాపీగా తింటూ ఉంటారు. ఎవరి ఇష్టం ప్రకారం ఉసిరి, మామిడి, వెల్లుల్లి, నాన్ వెజ్ పచ్చళ్లు తింటూ ఉంటారు. ఊరగాయలు ఎంతో..

Pickles in Monsoon: ఇది విన్నారా.. వర్షా కాలంలో ఆవకాయ అస్సలు తినకూడదట!
Pickles In Monsoon
Follow us on

వర్షా కాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ కాలంలో వేడి వేడిగా, కారంగా ఉండే ఆహారాలు తినాలనిపిస్తుంది. అందుకే చాలా మంది మిరపకాయ బజ్జీలు, పకోడీలు, ఇతర స్నాక్స్ చేసుకుని తింటూ ఉంటారు. ఇక వేసవిలో పెట్టిన పచ్చళ్లు అన్నీ ఈ సీజన్‌లో సేల్ అవుతాయి. వేడి వేడిగా అన్నం వండుకుని.. అందులో పచ్చళ్లు వేసుకుని హ్యాపీగా తింటూ ఉంటారు. ఎవరి ఇష్టం ప్రకారం ఉసిరి, మామిడి, వెల్లుల్లి, నాన్ వెజ్ పచ్చళ్లు తింటూ ఉంటారు. ఊరగాయలు ఎంతో రుచిగా ఉంటాయి. తినే కొద్దీ తినాలని అనిపిస్తూ ఉంటుంది. దీంతో రోజూ తింట ఉంటారు. కానీ వీటిని తింటే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. అదేంటి? మేము ఎప్పటి నుంచో తింటున్నాం.. మాకేం కాలేదు అనుకుంటున్నారా.. వర్షా కాలంలో ఊరగాయలు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒళ్లు నొప్పులు చేస్తాయి:

రెయినీ సీజన్‌లో ఊరగాయలు తినడం వల్ల శరీరంలో నొప్పులు వస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్లు అనేవి ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. అందులోనూ ఈ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒంటి నొప్పులు వస్తాయి. శరీరంలో వాపు కూడా వస్తుంది.

జీర్ణ సమస్యలు:

వర్షా కాలంలో ఊరగాయలు తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఎందుకంటే ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. దీని వల్ల గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం టి సమస్యలు వస్తాయి. ఒక్కొక్కరికి విరేచనాలు కూడా అవుతాయి. పేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

ఇవి కూడా చదవండి

రక్త పోటు:

వానా కాలంలో నిల్వ పచ్చళ్లు తినడం వల్ల బీపీ కూడా పెరుగుతుంది. వీటల్లో ఉప్పు, కారాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన శరీరంలో సోడియం కంటెంట్ పెరుగుతుంది. దీని వలన బీపీ పెరిగి.. గుండెను రిస్క్‌లో పెడుతుంది.

ఎముకలు బలహీనం:

పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల ఎముకలు కూడా బలహీనంగా తయారవుతాయి. ఎందుకంటే పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల శరీరం క్యాల్షియాన్ని ఎక్కువగా గ్రహించలేదు. దీంతో ఎముకలు బలహీనంగా తయారవుతాయి.

మూత్ర పిండాల సమస్యలు:

పచ్చళ్లు తినడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. పచ్చళ్లలో ఉండే ఉప్పు వల్ల కిడ్నీలపై ఒత్తిడి అనేది పెరుగుతుంది. దీని వల్ల మూత్ర పిండాలు సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత తక్కువగా తినడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..