Dragon Fruit: వర్షా కాలంలో డ్రాగన్ ఫ్రూట్ తింటే చర్మానికి ఎంతో మేలు..

|

Jul 23, 2024 | 2:57 PM

డ్రాగన్ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ ఫ్రూట్ తింటున్నారు. మార్కెట్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఇంటి వద్ద పెరట్లో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్‌ మొక్కను పెంచుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ధరలోనే ఈ ఫ్రూట్స్ లభ్యమవుతున్నాయి. ఇంతకు ముందు ఈ ఫ్రూట్ ఎక్కడో కానీ దొరికేవి కావు. డ్రాగన్ ఫ్రూట్‌లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల చాలా రకాల..

Dragon Fruit: వర్షా కాలంలో డ్రాగన్ ఫ్రూట్ తింటే చర్మానికి ఎంతో మేలు..
Dragon Fruit
Follow us on

డ్రాగన్ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ ఫ్రూట్ తింటున్నారు. మార్కెట్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఇంటి వద్ద పెరట్లో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్‌ మొక్కను పెంచుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ధరలోనే ఈ ఫ్రూట్స్ లభ్యమవుతున్నాయి. ఇంతకు ముందు ఈ ఫ్రూట్ ఎక్కడో కానీ దొరికేవి కావు. డ్రాగన్ ఫ్రూట్‌లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక, సాధారణ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా వర్షా కాలంలో తింటే మరింత మంచిది. ఈ కాలంలో ఎక్కువగా చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ తగ్గించడంలో ఈ పండు ఎంతో చక్కగా పని చేస్తుంది. ఈ సీజన్‌లో డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మానికి ఎంతో మేలు:

వర్షా కాలంలో డ్రాగన్ ఫ్రూట్‌ తినడం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సిలు చర్మానికి రక్షణగా నిలుస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయ పడుతుంది. ఈ పండులో ఉండే విటమిన్ సి చర్మాన్ని హైడ్రేట్‌గా, కాంతివంతంగా తయారు చేస్తుంది. ప్రతి రోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే ముడతలు, మచ్చలు తగ్గి ముఖం, చర్మం అందంగా కనిపిస్తాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

వర్షా కాలంలో డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఇన్ ఫెక్షన్‌ను తగ్గించేందుకు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను ఎటాక్ చేయకుండా వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం:

డ్రాగన్ ఫ్రూట్‌ తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. అలాగే రక్త పోటును కూడా తగ్గిస్తుంది. గుండె కండరాలను బలోపేతం చేసి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుంది. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ ఫ్రూట్ తింటే మరింత మంచిది.

జీర్ణ శక్తి పెరుగుదల:

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో డ్రాగన్ ఫ్రూట్ ఎంతో సహాయ పడుతుంది. ఇందులో ఉండే గుణాలు మల బద్ధకాన్ని నివారించడానికి, జీర్ణ క్రియను మెరుగు పరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా పొట్టలోని మంచి బ్యాక్టీరియాను కూడా పెంచేందుకు సహాయ పడుతుంది.

మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు:

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ పండు తినడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా శరీరంలోని క్యాన్సర్ కణాలను, ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టాల నుంచి బాడీని కాపాడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..