AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి నిద్రకు ముందు మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?

శరీరంలో 60 నుంచి 70 శాతం నీటితోనే తయారవుతుంది. అందుకే వైద్యులు ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ పడుకునే ముందు నీళ్లు తాగే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అలవాటు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నిద్రకు..

రాత్రి నిద్రకు ముందు మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
ఉదయం ఖాళీ కడుపుతో 1 నుంచి 2 గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుంది. ఈ మొత్తం శరీరాన్ని ఉత్తేజపరిచి రోజును ప్రారంభించడానికి సరైన మొత్తంగా పరిగణించబడుతుంది.
Srilakshmi C
|

Updated on: Feb 06, 2026 | 9:36 PM

Share

శరీరానికి నీళ్లు చాలా ముఖ్యమని అందరికీ తెలిసిన విషయమే. శరీరంలో 60 నుంచి 70 శాతం నీటితోనే తయారవుతుంది. అందుకే వైద్యులు ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ పడుకునే ముందు నీళ్లు తాగే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అలవాటు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నిద్రకు భంగం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో? ఈ సమయంలో ఎక్కువ నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో? ఇక్కడ తెలుసుకుందాం..

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లబరుస్తుంది. రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. ఇంకా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కండరాల నొప్పి తగ్గడమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.

ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కలిగే సమస్యలు

పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగడం వల్ల నోక్టురియా అనే సమస్య వస్తుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. ఇది మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. తగినంత నిద్ర రాకపోవడం వల్ల అలసట, తలనొప్పి, మరుసటి రోజు ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. దీర్ఘకాలంలో, ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కింది సలహాను తప్పకుండా పాటించాలి

  • నీళ్లు తాగిన వెంటనే నిద్రపోవడం మంచిది కాదు.
  • నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు నీళ్లు తాగడం మంచిది.
  • రాత్రి భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
  • పడుకునే ముందు దాహం వేస్తే, పెద్ద గ్లాసు నీళ్లు తాగడం కంటే కొన్ని సిప్స్ నీళ్లు తాగడం మంచిది.

నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అది మీ నిద్రకు భంగం కలిగించకూడదు. కాబట్టి పడుకునే ముందు సమయానికి అనుగుణంగా నీళ్లు తాగాలి. తద్వారా మీ ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?