Kitchen Hacks: కిచెన్ సింక్ బ్లాక్ అవ్వకుండా.. దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

|

Jul 17, 2024 | 1:23 PM

కిచెన్ నుంచి దుర్వాసన రావడానికి సింక్ కూడా ఒక కారణం. సింక్ సరిగ్గా శుభ్రం చేయకపోతే చెడు వాసన వస్తుంది. అంతే కాకుండా అక్కడే ఎక్కువగా క్రిములు, బ్యాక్టీరియా వంటివి చేరతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సింక్ శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడూ సింక్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. పాత్రలు కడిగినప్పుడు మిగిలిన వ్యర్థ పదార్థాలన్నీ సింక్‌లో ఇరుక్కుని బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దీని వల్ల అందులో నుంచి నీరు బయటకు రాదు. మీ కిచెన్ సింక్ ఎక్కువగా..

Kitchen Hacks: కిచెన్ సింక్ బ్లాక్ అవ్వకుండా.. దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Kitchen Sink
Follow us on

కిచెన్ నుంచి దుర్వాసన రావడానికి సింక్ కూడా ఒక కారణం. సింక్ సరిగ్గా శుభ్రం చేయకపోతే చెడు వాసన వస్తుంది. అంతే కాకుండా అక్కడే ఎక్కువగా క్రిములు, బ్యాక్టీరియా వంటివి చేరతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సింక్ శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడూ సింక్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. పాత్రలు కడిగినప్పుడు మిగిలిన వ్యర్థ పదార్థాలన్నీ సింక్‌లో ఇరుక్కుని బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దీని వల్ల అందులో నుంచి నీరు బయటకు రాదు. మీ కిచెన్ సింక్ ఎక్కువగా బ్లాక్ అయిపోతూ ఉన్నా.. దుర్వాసన వస్తూ ఉన్నా కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బేకింగ్ సోడా – వెనిగర్:

ఇంటిని శుభ్రంగా, క్లీన్‌గా ఉంచడంలో బేకింగ్ సోడా, వెనిగర్ ఎంతో చక్కగా పని చేస్తాయి. ఎలాంటి వాటిని అయినా బేకింగ్ సోడా, వెనిగర్ ఎంతో శుభ్రంగా క్లీన్ చేస్తాయి. మురికిని తొలగించడంలో బేకింగ్ సోడా చక్కగా హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా అందులో చెత్త పేరుకు పోతే శుభ్రం చేయడానికి కూడా ఇవి సహాయ పడతాయి.

బేకింగ్ సోడా, వెనిగర్ రెండూ కలిపి మిశ్రమంలా తయారు చేసి.. సింక్‌ రంధ్రంలో పోయాలి. ఇలా చేయడం వల్ల సింక్‌లో ఉండే మురికే కాకుండా గొట్టంలో ఉండే నాచు కూడా వెళ్తుంది. ఈ మిశ్రమంతో సింక్‌ శుభ్రం చేసినా కూడా తెల్లగా మిలమిలా మెరుస్తుంది. ఆ తర్వాత చీపురు పుల్లతో సింగ్ రంధ్రంలోకి పోనిచ్చి.. కదిలించడం వల్ల కూడా పైపులో మురికి పోతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ – ఈనో:

వంట గదిని శుభ్రం చేయడానికి నిమ్మకాయ, ఈనో కూడా చక్కగా పని చేస్తాయి. నిమ్మకాయ రసం, ఈనో కలపడం వల్ల ఒక యాసిడ్‌‌లా తయారవుతుంది. అంతే కాకుండా దుమ్ము, జిడ్డు, మురికిని వదుల్చుతాయి. నిమ్మకాయ – ఈనోతో సింక్‌ గొట్టంలోని మురికినే కాకుండా. సింక్‌ని కూడా తెల్లగా మార్చుతుంది. ఈ మిశ్రమం వాడటం వల్ల దుర్వాసన కూడా దూరమవుతుంది.

ఈనో పౌడర్‌లో నిమ్మకాయ రసం పిండి.. ఆ తర్వాత ఒక్క స్క్రబ్బర్ సహాయంతో సింక్‌ మొత్తాన్ని రుద్దండి. ఒక నిమిషం ఆగి.. మొత్తం క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల సింక్ కొత్తదానిలా మెరిసి పోతుంది. అంతే కాకుండా దుర్వాసన కూడా దూరమవుతుంది. నిమ్మరసంలో ఉప్పు లేదా సాల్ట్ కూడా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమంతో క్లీన్ చేసినా కూడా చెడు వాసన పోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..