Cough-Cold Remedies: వర్షా కాలంలో వచ్చే జలుబు, దగ్గు త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి..

|

Jul 21, 2024 | 5:24 PM

వర్షా కాలం రాగానే చిన్న వారి నుంచి పెద్ద వారిగా ఇబ్బంది పడే సమస్యల్లో జలుబు, దగ్గు, జ్వరం కామన్‌గా ఉంటాయి. జ్వరం రెండు రోజుల్లో తగ్గినా.. జలుబు, దగ్గు మాత్రం చికిత్స తీసుకున్నా కూడా అంత ఈజీగా తగ్గవు. చాలా మందికి పది రోజులు, రెండు వారాలు ఉంటూ ఉంటుంది. జలుబు, దగ్గు ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దగ్గుతూ, చీదుతూ చెవులు కూడా నొప్పులు వస్తాయి. ఏ ఆహారం తీసుకోవాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. చిన్న పిల్లల పరిస్థితి మరీ దారుణంగా..

Cough-Cold Remedies: వర్షా కాలంలో వచ్చే జలుబు, దగ్గు త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి..
Cough Cold Remedies
Follow us on

వర్షా కాలం రాగానే చిన్న వారి నుంచి పెద్ద వారిగా ఇబ్బంది పడే సమస్యల్లో జలుబు, దగ్గు, జ్వరం కామన్‌గా ఉంటాయి. జ్వరం రెండు రోజుల్లో తగ్గినా.. జలుబు, దగ్గు మాత్రం చికిత్స తీసుకున్నా కూడా అంత ఈజీగా తగ్గవు. చాలా మందికి పది రోజులు, రెండు వారాలు ఉంటూ ఉంటుంది. జలుబు, దగ్గు ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దగ్గుతూ, చీదుతూ చెవులు కూడా నొప్పులు వస్తాయి. ఏ ఆహారం తీసుకోవాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. చిన్న పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వాళ్లు ఏమీ చెప్పుకోలేక ఏడుస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల హోమ్ మేడ్ చిట్కాలను ఫాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు పాలు:

జలుబు, దగ్గు అనేవి త్వరగా తగ్గాలంటే పసుపు పాలు తాగండి. వర్షా కాలంలో పసుపు పాలు తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. పసుపు పాలు తాగితే జ్వరం, దగ్గు త్వరగా తగ్గుతాయి. మూడు రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

ఉల్లిపాయ వాటర్:

ఉల్లిపాయతో కూడా జలుబు, దగ్గును తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయలో కూడా ఘాటు ఉంటుంది. ఉల్లిపాయ తీసుకుని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును కొద్దిగా నీటిలో ఓ ఐదు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత రోజూ ఒకసారి తాగితే ఛాతీలో కఫం పోతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

లవంగం టీ:

జలుబు, దగ్గను తగ్గించడంలో లవంగాలు కూడా చక్కగా పనిచేస్తాయి. రెండు లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలను ఓ గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. ఇది కొద్దిగా మరిగాక గోరు వెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి.

అల్లం టీ:

అల్లం టీ తాగడం వల్ల కూడా జలుబు, దగ్గును తగ్గించుకోవచ్చు. తొక్క తీసిన అల్లం ముక్కని దంచి.. గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా తరచూ తాగితే కఫం కరికి బయటకు పోతుంది. జలుబు, దగ్గు కూడా తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..