Sleeping Tips: నిమిషాల్లో నిద్రలోకి జారుకోవాలంటే ఇలా చేయండి..

|

Aug 19, 2024 | 4:22 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో నిద్ర కూడా ఒకటి. ఆహారం తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఒక్క రోజు నిద్ర లేకపోయినా చాలా నీరసంగా ఉంటారు. మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. సరిగ్గా నిద్ర పోకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె పోటు, థైరాయిడ్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. కొంత మంది అలా పడుకున్న వెంటనే..

Sleeping Tips: నిమిషాల్లో నిద్రలోకి జారుకోవాలంటే ఇలా చేయండి..
Sleeping Tips
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో నిద్ర కూడా ఒకటి. ఆహారం తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఒక్క రోజు నిద్ర లేకపోయినా చాలా నీరసంగా ఉంటారు. మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. సరిగ్గా నిద్ర పోకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె పోటు, థైరాయిడ్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. కొంత మంది అలా పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. కానీ మరికొందరు మాత్రం గంటలు గడిచినా నిద్ర పట్టక సతమతమవుతూ ఉంటారు. ఇంకొందరికి ఒత్తిడి, ఆందోళన వలన నిద్ర అనేది సరిగా పట్టదు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పడుకోగానే నిమిషాల్లో నిద్ర అనేది పడుతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గది చీకటిగా ఉండేలా చూసుకోండి:

వెలుతురు ఉండగా పడుకుంటే.. నిద్ర అనేది సరిగా పట్టదు. కాబట్టి మీరు పడుకునే గది చీకటిగా ఉండేలా చూసుకోండి. గదిలో లైట్లు, అన్నీ ఆఫ్ చేసి పడుకోండి. చీకట్లో నిద్రకు కావాల్సిన మెలనిన్ ఉత్పత్తి పెరిగి మంచి నిద్ర పడుతుంది.

బెడ్ సరిగా ఉండేలా చూసుకోండి:

మీరు నిద్ర అనేది వెంటనే పట్టాలంటే.. మీరు పడుకునే బెడ్ మెత్తగా ఉండేలా చూసుకోండి. మీరు వాడే పరుపు, దిండు సౌకర్యంగా లేకపోతే నిద్ర సరిగా పట్టదు. కాబట్టి దిండ్లు, పరుపు మంచివి వాడటం బెటర్.

ఇవి కూడా చదవండి

మొబైల్‌కు దూరంగా:

మీకు వెంటనే నిద్ర పట్టాలంటే.. అరగంట ముందు నుంచే ఫోన్‌కు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వలన నిద్ర అనేది చక్కగా పడుతుంది. అదే విధంగా మీరు నిద్రించే గది ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎలాంటి సౌండ్స్ లేకుండా ఉండటం వల్ల నిద్ర పడుతుంది.

మంచినీరు తక్కువగా:

మీరు నిద్రించే ముందు నీటిని అనేది తక్కువగా తీసుకోండి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిన్‌కు లేవాల్సి ఉంటుంది. దీంతో మీ నిద్ర చెడిపోయే అవకాశం ఉంది. ఆహారం కూడా మితంగా తినాలి. మరీ ఎక్కువగా తిన్నా నిద్ర పట్టదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..