Guava Juice: ఈ పండు తాగారంటే.. షుగర్, బీపీలకు చెక్ పెట్టొచ్చు..

| Edited By: Ravi Kiran

Jul 20, 2024 | 9:30 PM

జామకాయ అంటే చాలా మందికి ఇష్టం. యాపిల్‌లో ఉండే పోషకాలు అన్నీ ఇందులోనే లభిస్తాయి. యాపిల్ తినలేని కొనలేని వారు జామ పండు తింటే చాలు. జామ పండు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. నేచురల్‌గానే తియ్యగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్, బీపీ ఉన్నవాళ్లులు కూడా తినవచ్చు. జీర్ణ క్రియకు కూడా చాలా మంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జామ పండుతోనే కాకుండా జామ చెట్టుతో..

Guava Juice: ఈ పండు తాగారంటే.. షుగర్, బీపీలకు చెక్ పెట్టొచ్చు..
Guava Juice
Follow us on

జామకాయ అంటే చాలా మందికి ఇష్టం. యాపిల్‌లో ఉండే పోషకాలు అన్నీ ఇందులోనే లభిస్తాయి. యాపిల్ తినలేని కొనలేని వారు జామ పండు తింటే చాలు. జామ పండు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. నేచురల్‌గానే తియ్యగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్, బీపీ ఉన్నవాళ్లులు కూడా తినవచ్చు. జీర్ణ క్రియకు కూడా చాలా మంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జామ పండుతోనే కాకుండా జామ చెట్టుతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జామకు చెందిన ఆకులు, పండ్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పండు తినలేనివారు జామ పండు జ్యూస్ తాగినా కూడా ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి. జామ పండు రసం తాగడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

జామ పండు రసం తాగడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బల పడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులతోనే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో కూడా పోరాడే శక్తి వస్తుందని నిపుణులు అంటున్నారు. త్వరగా అనారోగ్య సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి.

క్యాన్సర్‌తో పోరాడుతుంది:

జామకాయ రసం తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి.. క్యాన్సర్ కణాల పెరగకుండా సహాయ పడతాయి. క్యాన్సర్ ఉన్నవారు తాగినా.. త్వరగా రికవరీ అవుతారు.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్:

జామకాయ రసం తాగడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. అధిక బరువు ఉన్నారు ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగుతూ డైట్ మెయిన్ టైన్ చేస్తూ.. వ్యాయమం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చర్మం ఆరోగ్యం:

జామకాయ జ్యూస్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా మచ్చలు, గీతలు తొలగి.. స్కిన్ కాంతివంతంగా మారుతుంది.

డయాబెటీస్ కంట్రోల్:

ఈ జ్యూస్ తాగడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. రసంలో ఏమీ కలపకుండా నేరుగా తాగితే.. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డాక్టర్ సలహా మేరకు ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగవచ్చు. గుండె సమస్యలు, రక్త పోటు కూడా పెరగదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..