Dal Cooking Tips: మీరూ పప్పును కుక్కర్‌లో వండుతున్నారా? ఉడికించేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం

|

Sep 10, 2024 | 1:09 PM

దక్షిణాది భారతీయుల ప్రధాన ఆహారం వరి అన్నం. అన్నంతో కొందరు కూరగా ఎక్కువగా పప్పును వినియోగిస్తుంటారు. చేపలు, చికెన్‌ వంటి మాంసాహారాలు ఎన్ని ఉన్నా పప్పు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. పైగా పప్పు, అన్నం మంచి కాంబినేషన్‌ కూడా. అందుకే వీటిని 'కంఫర్ట్ ఫుడ్స్' అంటారు. పప్పు చేసిన వంటకాలు వేడి అన్నంతో రుచిగా ఉంటాయి. అంతేకాకుండా పప్పులో లభించే పోషకాలు మరే ఇతర ఆహారంతో సరిపోలవు..

Dal Cooking Tips: మీరూ పప్పును కుక్కర్‌లో వండుతున్నారా? ఉడికించేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం
Dal Cooking Tips
Follow us on

దక్షిణాది భారతీయుల ప్రధాన ఆహారం వరి అన్నం. అన్నంతో కొందరు కూరగా ఎక్కువగా పప్పును వినియోగిస్తుంటారు. చేపలు, చికెన్‌ వంటి మాంసాహారాలు ఎన్ని ఉన్నా పప్పు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. పైగా పప్పు, అన్నం మంచి కాంబినేషన్‌ కూడా. అందుకే వీటిని ‘కంఫర్ట్ ఫుడ్స్’ అంటారు. పప్పు చేసిన వంటకాలు వేడి అన్నంతో రుచిగా ఉంటాయి. అంతేకాకుండా పప్పులో లభించే పోషకాలు మరే ఇతర ఆహారంతో సరిపోలవు. అయితే ఒక్కోసారి వంట చేసేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్‌ వల్ల పప్పు తిన్న తర్వాత కూడా అందులోని పోషకాలు శరీరానికి అందవు. అందుకే పప్పు వండే విధానం చాలా ముఖ్యం. నేటి కాలంలో చాలా మంది ప్రెషర్ కుక్కర్‌లో పప్పులు ఉడకబెట్టి వంట చేస్తుంటారు. నీటిలో నానబెట్టడం నుంచి ఉడకబెట్టడం వరకు – పప్పు వండడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఎక్కువసేపు ఉడకబెట్టవద్దు

పప్పు తప్పనిసరిగా ఉడకబెట్టాలి. కానీ ఎక్కువ సేపు ఉడకనీయవద్దు. ప్రెషర్ కుక్కర్‌లో లేదా సాస్ ప్యాక్‌లో పప్పులను ఎక్కువసేపు నీటిలో ఉడకబెట్టడం వల్ల దానిలోని ప్రోటీన్‌ను నాశనం అవుతుంది. పప్పులను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే అమినో యాసిడ్‌లు నశిస్తాయి. ప్రెజర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఫైటిక్ యాసిడ్ గాఢత తగ్గుతుంది. అలాగే, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ సమతుల్యత కోల్పోతుంది.

నీటిలో నానబెట్టి ఉడికించాలి

పప్పును నీళ్లలో నానబెట్టకుండా ఉడికించకూడదు. నీటిలో నానబెట్టకపోతే, పప్పుకు ఎటువంటి పోషకాలు అందవు. పైగా నానబెట్టకుండా చేసిన పప్పు ఆహారంలో తీసుకుంటే జీర్ణ రుగ్మతలు సంభవించవచ్చు. నీటిలో నానబెట్టిన తర్వాత పప్పు వంటకు వినియోగిస్తే సులభంగా జీర్ణమవుతుంది. పప్పులలో ఫైటిక్ యాసిడ్, టానిన్లు వంటి వివిధ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాల శోషణను నిరోధిస్తాయి. ఉడికించే ముందు పప్పును 8-12 గంటలు నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే పప్పుధాన్యాల్లోని పోషకాలు రెట్టింపు అవుతాయి. పైగా పప్పులు త్వరగా ఉడుకుతాయి కూడా.

ఇవి కూడా చదవండి

పప్పుకు ఎంత నీరు కలపాలి

ఒక కప్పు పప్పును కొలిచి, అందులో రెండు కప్పుల నీరు తీసుకుంటే చక్కగా ఉడుకుతుంది. నీరు ఆవిరైపోయే వరకు పప్పును ఉడకబెట్టవచ్చు. అనంతరం అవసరమైనమేర మళ్ళీ నీరు కలుపుకోవచ్చు. కానీ ఉడికించిన తర్వాత అదనపు నీటిని పారవేయకూడదు. పప్పు నుంచి విటమిన్ బి, సి బయటకు వస్తాయి. ఆ నీటిని కూడా వంటకు వినియోగించాలి.

మరిన్ని లైఫ్‌స్టై్‌ల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.