Fasting for Cancer: ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

| Edited By: TV9 Telugu

Aug 06, 2024 | 6:13 PM

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌తో పోరాడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుంది. శరీరంలో క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే మాత్రమే బయట పడుతుంది. దీంతో చాలా మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే క్యాన్సర్ నివారణ, క్యాన్సర్‌ను ప్రభావితం చేసే అంశాలపై పరిశోధకులు పలు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ఈ పరిశోధనల్లో క్యాన్సర్‌ను నయం చేసే విధానాల గురించి..

Fasting for Cancer: ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
Fasting For Cancer
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌తో పోరాడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుంది. శరీరంలో క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే మాత్రమే బయట పడుతుంది. దీంతో చాలా మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే క్యాన్సర్ నివారణ, క్యాన్సర్‌ను ప్రభావితం చేసే అంశాలపై పరిశోధకులు పలు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ఈ పరిశోధనల్లో క్యాన్సర్‌ను నయం చేసే విధానాల గురించి చాలా విషయాలు బయట పడుతున్నాయి. క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపవాసం విషయం కూడా చర్చకు వచ్చింది.

ఉపవాసం ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఫాస్టింగ్ అనేది.. ఒక నేచురల్ కిల్లర్‌లా కణాల మీద పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బలేపేతం అవుతుందట. ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడటంతో క్యాన్సర్ కణాలు నశిస్తున్నట్లు వెల్లడించారు. సాధారణంగా క్యాన్సర్‌కు కీమో థెరపీ చేస్తారు. ఈ మందులు వల్ల హానికరమైన దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యకరమైన కణాలను రక్షించగలదని.. 2012లో ఎలుకల మీద చేసిన ప్రయోగాల్లో తేలింది.

వారంలో రెండు సార్లు ఉపవాసం..

ఇటీవల జర్మన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయనంలో అప్పుడప్పుడూ ఉపవాసాలు చేయడం వల్ల కాలేయం, క్యాన్సర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకున్నారు. వారంలో ఐదు రోజుల పాటు క్రమంగా తిని.. రెండు రోజుల పాటు ఉపవాసం చేయడం వల్ల కాలేయ క్యాన్సర్ ప్రమాదం నివారించవచ్చని నిపుణులు తేల్చారు.

ఇవి కూడా చదవండి

వైద్యుల సలహా తీసుకోవాలి..

ఉపవాసం ఉండటం వల్ల క్యాన్సర్ కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఉపవాసం చేయడం వల్ల శరీరంలో ఉండే చెడిపోయిన కాలు శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు ముదరక ముందే ఈ కణాలను నాశనం చేస్తుంది. అయితే ఉపవాసం చేయాలా? వద్దా? అన్నది వైద్యుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొరి శరీరం ఒక్కోలా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..