ఖరీదైన ఫేస్ సీరంలు వద్దు.. శంఖు పూలతో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

ముఖంపై మచ్చలు, ముడతలు తగ్గించుకోవడానికి చాలామంది ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అయితే, ఇంట్లోనే సహజసిద్ధంగా లభించే శంఖు పూలు, అవిసె గింజలు, కలబంద జెల్ ఉపయోగించి అద్భుతమైన ఫేస్ సీరం తయారు చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ హోమ్మేడ్ సీరం చర్మానికి సహజ మెరుపును అందిస్తుందని చెబుతున్నారు.తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

ఖరీదైన ఫేస్ సీరంలు వద్దు.. శంఖు పూలతో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
Butterfly Pea Flower Face Serum

Updated on: Nov 25, 2026 | 2:17 PM

ముఖంపై మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలు కనిపించడం మొదలవగానే చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన స్కిన్ కేర్ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతారు. అయితే, రసాయనాలతో కూడిన క్రీముల కంటే ఇంట్లోనే సహజసిద్ధంగా తయారుచేసుకునే చిట్కాలను ఇష్టపడేవారు కూడా ఎక్కువే. ప్రస్తుతం సోషల్ మీడియాలో నీలిరంగు శంఖు పూలతో తయారుచేసే హోమ్‌మేడ్‌ ఫేస్ సీరం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సీరం రాసుకోవడం వల్ల ముఖంలో కాంతి పెరగడంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గుతాయని చెబుతున్నారు. మరి ఈ సీరం తయారీ విధానం, వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

ఈ ఫేస్ సీరం తయారుచేసుకోవడానికి ఇంట్లో ఉండే సాధారణ వస్తువులే సరిపోతాయి.

తాజా లేదా ఎండిన శంఖు పూలు: 6 నుండి 8

ఇవి కూడా చదవండి

నీరు: ఒకటిన్నర కప్పు

అవిసె గింజలు: 2 టేబుల్ స్పూన్లు

కలబంద గుజ్జు: 1 టీస్పూన్

బాదం నూనె: కొన్ని చుక్కలు

తయారీ విధానం:

ముందుగా శంఖు పూలను శుభ్రమైన నీటితో కడగాలి. ఒక గిన్నెలో నీటిని వేడి చేసి, అందులో ఈ పూలను వేసి మూతపెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీనివల్ల పూలలోని నీలిరంగు మొత్తం నీటిలోకి దిగుతుంది. ఆ తర్వాత నీటిని చల్లారనిచ్చి వడకట్టుకోవాలి.
మరోవైపు, కొద్దిగా నీటిలో అవిసె గింజలను వేసి మరిగించాలి. నీరు చిక్కగా జెల్ లాగా మారిన తర్వాత స్టవ్ ఆపి, వడకట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ అవిసె గింజల జెల్‌లో ముందుగా సిద్ధం చేసుకున్న శంఖు పూల నీరు, కలబంద జెల్ వేసి బాగా కలపాలి. మీకు కావాలనుకుంటే ఇందులో కొన్ని చుక్కల బాదం నూనెను కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

విటమిన్-ఇ క్యాప్సూల్ కలపడం అవసరమా?

హోం మేడ్ సీరంలలో చాలామంది విటమిన్-ఇ క్యాప్సూల్స్ వేయమని సలహా ఇస్తుంటారు. కానీ చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది అందరి చర్మానికి సరిపడదు. కొందరికి దీనివల్ల దురద, మంట లేదా అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం, మొటిమలు ఉన్నవారు విటమిన్-ఇ వాడకపోవడమే మంచిది.

నిపుణుల సూచన ఏమిటి?

శంఖు పూలలో ఆంథోసైనిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేసినప్పటికీ, ఈ సీరం వాడటం వల్ల మచ్చలు, ముడతలు పూర్తిగా మాయమవుతాయనడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఎండ, వయసు పెరగడం, హార్మోన్ల మార్పుల వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. కాబట్టి కేవలం ఇంటి చిట్కాలపైనే పూర్తిగా ఆధారపడకూడదు. ఈ సీరంను ముఖానికి రాసుకునే ముందు చెవి వెనుక లేదా చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us