Avoid These Alcohol: మీరు మద్యం తాగి శృంగారంలో పాల్గొంటున్నారా..? ఇక అంతే సంగతి..!

Avoid These Alcohol: శృంగారం అనేది జీవితంలో ఒక భాగం. ఈ విషయంలో ప్రతి ఒక్క మగాడు ఎంతో ఆశపడతాడు. శృంగారంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పడక గదిలో..

Avoid These Alcohol: మీరు మద్యం తాగి శృంగారంలో పాల్గొంటున్నారా..? ఇక అంతే సంగతి..!
Avoid These Alcohol
Follow us
Subhash Goud

|

Updated on: Sep 10, 2022 | 10:54 AM

Avoid These Alcohol: శృంగారం అనేది జీవితంలో ఒక భాగం. ఈ విషయంలో ప్రతి ఒక్క మగాడు ఎంతో ఆశపడతాడు. శృంగారంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పడక గదిలో తన భార్యతో ఎంతో సేపు గడపాలని భావిస్తుంటాడు. అయితే కొందరు మాత్రం మద్యం సేవిస్తే శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనవచ్చని, ఎంబతో ఉల్లాసంగా ఉంటుందని, ఇందు కోసం శక్తి కూడా ఎక్కువగా వస్తుందని భావిస్తుంటారు. చాలా మంది శృంగారంలో పాల్గొనే ముందు మద్యం సేవిస్తుంటారు. కానీ అది మంచిది కాదని నిపుణులు పదే పదే చెబుతున్నారు. శృంగారం మన తినే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సంభోగానికి మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనే దానిపై ఆధార పడి ఉంటుందట. అన్ని కంటే ముఖ్యంగా సంభోగం సమయంలో మద్యం అస్సులు తాగకూడదని సూచిస్తున్నారు నిపుణులు.

మద్యం అనేది కాస్త విశ్రాంతికి దోహదం చేస్తుంది. కానీ అదే పనిగా అవసరానికి మించి తాగడం వల్ల మీ లైంగిక సామర్థ్యంపై దెబ్బతిస్తుందని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆల్కహాల్‌ టెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తుంది. మద్యం నాడీ వ్యవస్థ పనితీరును తగ్గిస్తుంది. అలాగే రక్త ప్రసరణ, నరాల సున్నితత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందట. దీని కారణంగా శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనలేరని చెబుతున్నారు.

సంతృప్తి కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోకపోవడం మంచిది. కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని నెమ్మదించేలా చేస్తుంది. దీని కారణంగా శృంగారం సమయంలో చెడు వాసన వస్తుంటుందట. దీని కారణంగా సంభోగం సమయంలో స్త్రీ, పురుషులకు ఇబ్బందిగా ఉంటుంది. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి