లోకేష్ గురించి టీడీపీలో ఇదే చర్చ: ఎంపి నందిగం సురేష్

చంద్రబాబు దళితులను ఎలా చూసారో అందరికీ తెలుసన్నారు వైసీపీ ఎంపి నందిగం సురేష్. 2014 నుండి టిడిపి పాలన చూసి దళితులంతా ఏకమయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక మేధావి జగన్ ను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు.. జై భీం అంటూ చంద్రబాబు అజెండా మోస్తున్నారు అని నందిగం విమర్శించారు. జగన్ కు దళితుల మద్దతు లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు.. టిడిపి హయాంలో దళితులు పై జరిగిన దాడులను ఈ నాయకులు ఎందుకు […]

లోకేష్ గురించి టీడీపీలో ఇదే చర్చ: ఎంపి నందిగం సురేష్

చంద్రబాబు దళితులను ఎలా చూసారో అందరికీ తెలుసన్నారు వైసీపీ ఎంపి నందిగం సురేష్. 2014 నుండి టిడిపి పాలన చూసి దళితులంతా ఏకమయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక మేధావి జగన్ ను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు.. జై భీం అంటూ చంద్రబాబు అజెండా మోస్తున్నారు అని నందిగం విమర్శించారు. జగన్ కు దళితుల మద్దతు లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు.. టిడిపి హయాంలో దళితులు పై జరిగిన దాడులను ఈ నాయకులు ఎందుకు ఖండించలేదు? అని ఆయన ప్రశ్నించారు. రాజధానిలో దళితులకు భూమి ఇవ్వలేదు అని ఈ మేధావులు ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు జగన్ కు అండగా ఉన్నారని.. దీంతో వీళ్లంతా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబును ఎంత నిలబెట్టాలని చూసినా ఆయనకి అంత సత్తా లేదు.. మొన్న ట్రాక్టర్ ను తోసినట్టు పార్టీని కూడా లోకేష్ తోసేస్తారు అని టీడీపీ నేతలే భావిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.