ఒక పార్టీ.. రెండు గాలాలు.. మరి ఏ గట్టునుంటారో..?

సీపీఐ ఓ వామపక్ష పార్టీ.. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంచెం ప్రాభల్యం ఉన్న పార్టీ. అయితే ఈ పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకు చాలా తక్కువే. అయితే నల్గొండ జిల్లాలో కాస్త ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఇప్పుడు ఈ సీపీఐ పార్టీ హుజూర్ నగర్ ఎన్నికల్లో కీలకంగా మారుతోంది. హోరాహోరిగా సాగుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికలో వీరు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ […]

ఒక పార్టీ.. రెండు గాలాలు.. మరి ఏ గట్టునుంటారో..?
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 11:51 AM

సీపీఐ ఓ వామపక్ష పార్టీ.. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంచెం ప్రాభల్యం ఉన్న పార్టీ. అయితే ఈ పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకు చాలా తక్కువే. అయితే నల్గొండ జిల్లాలో కాస్త ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఇప్పుడు ఈ సీపీఐ పార్టీ హుజూర్ నగర్ ఎన్నికల్లో కీలకంగా మారుతోంది. హోరాహోరిగా సాగుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికలో వీరు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానం కాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది అందని ద్రాక్షగా మారింది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం ఏడు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. దీంతో ఇప్పుడు ఏ విధంగానైనా.. హుజూర్ నగర్‌లో పాగా వేయాలిని టీఆర్ఎస్ పక్కా ప్లాన్లు వేస్తోంది. అంతేకాదు.. ఇప్పుటి వరకు ప్రజాతీర్పు టీఆర్ఎస్ వైపే అని ధీమా వ్యక్తం చేసిన అధికార పార్టీ.. ఇప్పుడు పొత్తుల కోసం సీపీఐతో చర్చలుజరుపుతోంది. అయితే సీపీఐ కూడా టీఆర్ఎస్ పార్టీ చర్చలు జరిపిన మాట వాస్తవమేనని.. అయితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పింది.

అయితే టీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. మీ మద్దతు తమకే ఇవ్వాలంటూ సీపీఐ నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. సైద్ధాంతికంగా సీపీఐకి.. కాంగ్రెస్‌ పార్టీకి మధ్య పెద్ద వ్యత్యాసాలు లేవని.. హుజూర్ నగర్‌లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. కేసీఆర్ బానిసల్లో ఇంకోకరు చేరుతారని.. సీపీఐ పార్టీ ప్రజల పక్షాన ఉండాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ వెంట సీపీఐ వెళ్లొద్దని తాము కోరుకుంటున్నామన్నారు.

అయితే సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఎవరికి మద్ధతు ఇవ్వాలన్న అంశంపై చర్చలు జరుపుతోంది. ఇప్పటికే సీపీఐ నాయకులతో కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకుల మంతనాలు పూర్తయ్యాయి. అయితే టీఆర్ఎస్‌కి అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా సీపీఐ- టీఆర్ఎస్‌లు కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీపీఐ పార్టీ అధికారికంగా ఎవరికి మద్ధతు తెలుపుతుందో ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.

Latest Articles