లేటెస్ట్ సర్వే.. టాలీవుడ్ నెంబర్  వన్ హీరోయిన్ ఆమె 

Phani.ch

18 May 2024

ప్రముఖ ఒక మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరో తెలియజేసింది.  ఇప్పుడు ఎవరి ర్యాంక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లిస్ట్ లో 10వ స్థానం కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నిలిచింది. టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి వరుస సినిమాలతో బిజీ గా ఉన్నది.

తరువాత 9 స్థానం పూజా హెగ్డే దక్కించుకుంది. పూజ హెగ్డే తెలుగులో నటించి రెండేళ్లు కావస్తుంది. వరుస సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల రేస్ లో వెనకబడింది.

ప్రస్తుతం  జోరు మీద ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈ ముద్దు గుమ్మ రేస్ లో 8వ స్థానం దక్కించుకుంది. త ఏడాది కీర్తి సురేష్ దసరా, భోళా శంకర్ చిత్రాల్లో నటించింది.

నెక్స్ట్ మిల్కీ బ్యూటీ తమన్నా 7వ స్థానం దక్కింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న తమన్నా ఫేమ్ తగ్గింది. అడపాదడపా ఆఫర్స్ అయితే వస్తూనే ఉన్నాయి.

ఈ లిస్ట్ లో రష్మిక మందాన  లిస్ట్ లో టాప్ 5 లో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ బ్యూటీ 6వ స్థానం దక్కింది.

తెలుగులో సినిమా చేసి చాలా కాలం అవుతున్నా సాయి పల్లవి లిస్ట్ లో వ స్థానంలో నిలిచింది. పూజా, కీర్తి,  రష్మిక కంటే ఆమె మెరుగైన రాంక్ సాధించింది. 

తరువాత 4 స్థానం కన్నడ భామ శ్రీలీల నిలిచి తన సత్తా చాటింది. ఆమె ఖాతాలో ప్లాప్స్ ఎక్కువగా ఉన్నా యూత్ లో తన క్రేజ్ తగ్గలేదు. 

ఆచితూచి సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదలైంది. 

పెళ్లయ్యాక కాజల్ జోరు తగ్గింది. అయిన రేస్ లో 2వ స్థానం కట్టబెట్టారు. గత ఏడాది భగవంత్ కేసరి మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. 

టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ కిరీటం సమంతకు దక్కింది. నిజానికి సమంత కూడా ఫార్మ్ లో లేరు. దాదాపు ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది.