రేవంత్‌రెడ్డికి చుక్కెదురు.. టీపీసీసీ రేస్ నుంచి ఔట్..!

తనకు పీసీసీ పీఠం ఖాయమని పార్టీలో బిల్డప్‌ ఇచ్చుకున్న రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ షాక్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. భూ కబ్జా వ్యవహారాలన్నింటినీ దాచిపెట్టి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తోన్న రేవంత్‌ వ్యవహారంలో

రేవంత్‌రెడ్డికి చుక్కెదురు.. టీపీసీసీ రేస్ నుంచి ఔట్..!
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 6:12 PM

తనకు పీసీసీ పీఠం ఖాయమని పార్టీలో బిల్డప్‌ ఇచ్చుకున్న రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ షాక్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. భూ కబ్జా వ్యవహారాలన్నింటినీ దాచిపెట్టి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తోన్న రేవంత్‌ వ్యవహారంలో అధిష్టానం వాస్తవాలు తెలుసుకుంటోంది.

తాజాగా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ అధినేత్రి సోనియాతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి మధ్య రేవంత్‌ ప్రస్తావన సైతం వచ్చిందని సమాచారం. రేవంత్‌ జైల్లో ఉన్నారని, చాలా కేసులు, ఆరోపణలు ఉన్నాయని సోనియా గాంధీనే చెప్పినట్లు కోమటిరెడ్డి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీపీసీసీ చీఫ్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డికి ఈ పదవి దక్కడం అసాధ్యమనే మాట వినిపిస్తోంది.

మరోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున కాకుండా తన సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరికొందరు ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది అనే విషయంపై సీనియర్‌ నేతలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి సమాచారం చేరవేస్తున్నారు. వి. హన్మంతరావు, జగ్గారెడ్డిలాంటి నేతలు రేవంత్‌ తీరును తప్పుబడుతున్నారు. తనమీద వచ్చిన నిందలను చెరిపేసుకోకుండా ఇతరులపై బురద జల్లడం ఎంతవరకు కరెక్ట్‌ అని వారు కడిగిపారేస్తున్నారు.

అయితే.. సొంత ఎజెండాతో ముందుకెళ్తున్న రేవంత్‌కు ఆజాద్‌ ఎలా మద్దతిస్తారని హన్మంతరావు ప్రశ్నించారు. దీనిపై పార్టీలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంమీద – రేవంత్‌ పాపాల పుట్ట పగిలిందని, భూకబ్జాల వ్యవహారం… ఆయన రాజకీయ భవిష్యత్‌ను అంధకారం చేసిందన్న అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పని చేస్తే ప్రజా ప్రయోజనం ఉండాలి. కనీసం పార్టీకైనా ఉపయోగపడాలి. ఈ రెండూలేకుండా.. నేనో లీడర్‌.. నాదో స్టయిల్ అంటే మాత్రం ఏ పార్టీ అయినా ఎందుకు సహిస్తుంది. రేవంత్ రెడ్డి వ్యవహారంలో సరిగ్గా ఇప్పుడదే జరిగిందన్న వాదన వినిపిస్తోంది.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..