కరోనా: ఇంగ్లాండ్ చేరుకున్న వెస్టిండీస్.. క్రికెట్‌లో ముందడుగు..

|

Jun 09, 2020 | 4:33 PM

అంతర్జాతీయ క్రికెట్ పునరుద్దరణలో తొలి అడుగు పడింది. జసన్ హోల్డర్ సారధ్యంలోని వెస్టిండీస్ జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ చేరుకుంది.

కరోనా: ఇంగ్లాండ్ చేరుకున్న వెస్టిండీస్.. క్రికెట్‌లో ముందడుగు..
Follow us on

అంతర్జాతీయ క్రికెట్ పునరుద్దరణలో తొలి అడుగు పడింది. జసన్ హోల్డర్ సారధ్యంలోని వెస్టిండీస్ జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ చేరుకుంది. సోమవారం ఆంటిగ్వాలో ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయగా.. వారందరికీ కూడా నెగటివ్ వచ్చింది. దీనితో వారిని స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్‌లో మాంచెస్టర్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పంపించింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జూలై 8 నుంచి మొదలుకానుంది.

మాంచెస్టర్ చేరుకున్న క్రికెటర్లు ఏడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటారని.. అక్కడ మరోసారి వాళ్లందరికీ కోవిడ్ 19 టెస్టులు చేస్తారని విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. మొత్తం ఏడు వారాల పాటు కొనసాగనున్న ఈ టూర్‌లో.. ఆటగాళ్లు సాధన, స్టేడియంల నుంచి బయటికి వెళ్లేందుకు, వచ్చేందుకు మొదలగున వాటి కోసం కరోనా మార్గదర్శకాలు, ఖచ్చితమైన నిబంధనలను రూపొందించారు. ఈ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులకు అనుమతి లేదు. కాగా, దాదాపు రెండు నెలల తర్వాత ఓ బయో సెక్యూర్ వాతావరణంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Also Read: 

రేపటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ…

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

యోగీ సర్కార్‌పై ప్రశంసలు.. ఇమ్రాన్‌పై సెటైర్లు.. పాక్ జర్నలిస్ట్ ట్వీట్ వైరల్..

కిమ్‌శకం ఇక ముగిసినట్లేనా.? ఆ ఇద్దరిలో ఒకరికి పగ్గాలు.!