Trending: లెక్చరర్ ట్రాక్ తప్పాడు. స్టూడెంట్స్‌కు పాఠాలతో పాటు మంచి చెడ్డలు నేర్పాల్సిన వ్యక్తి.. తప్పుడు పని చేశాడు. క్లాస్‌రూమ్‌లోనే బాధ్యతారాహిత్యంగా బిహేవ్ చేశాడు. లిక్కర్ సేవించి.. తూలుతూ డ్యాన్స్ చేశాడు. పంజాబ్(Punjab) పఠాన్‌కోట్(Pathankot) లోని జీఎన్‌డీయూ కాలేజ్‌లో ఈ ఘటన వెలగుచూసింది. ప్రజంట్ ఈ సార్ గారి నాటు స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు లెక్షరర్ కాలేజ్‌లో గణితం బోధిస్తున్నట్లు తెలిసింది. ‘నేను సంపాదించిన సొంత డబ్బుతో లిక్కర్ తాగుతున్నా, నన్ను ఎవరూ క్వచ్చన్ చేయలేరు’ అని సదరు లెక్చరర్ మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. అంతే కాదండోయ్.. ఓ మూవీ సాంగ్ కూడా ఆలపిస్తూ డ్యాన్స్ చేశాడు. నెట్టింట వైరల్ అయిన ఈ వీడియోపై సదరు లెక్ఛరర్ రెస్పాండ్ అయ్యాడు. తాను ఆ సమయంలో మందు తాగలేదని, తాగినట్లు నటించినట్లు వివరణ ఇచ్చాడు. అదంతా సరదాగా చేశామని.. కొందరు కావాలని వైరల్ చేశారని ఆరోపించాడు.
వీడియో చూడండి….
Pathankot University Professor in class inspired by CM himself ?pic.twitter.com/jzva71lZOS
— Lala ?? (@FabulasGuy) September 21, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..