Vehicle Scrappage Policy: 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలకూ స్క్రాపేజీ పాలసీ వర్తింపు.. 2022 ఏప్రిల్‌ 1 నుంచి అమలు

|

Jan 27, 2021 | 2:41 PM

ప్రైవేట్ వాహనాలనే కాదు.. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాహనాలు కూడా 15 ఏళ్లు పైబడిన పక్షంలో వాటికి కూడా స్క్రాపేజీ విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం...

Vehicle Scrappage Policy: 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలకూ స్క్రాపేజీ పాలసీ వర్తింపు..  2022 ఏప్రిల్‌ 1 నుంచి అమలు
Follow us on

Vehicle Scrappage Policy: 15 ఏళ్ల కంటే పాతవైన వాహనాల ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. వాతావరణ కాలుష్యం అధికమవుతుంది. దీనిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకుని రాబోతుంది. ప్రైవేట్ వాహనాలనే కాదు.. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాహనాలు కూడా 15 ఏళ్లు పైబడిన పక్షంలో వాటికి కూడా స్క్రాపేజీ విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం 2022 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనుంది. దీనిపై కేంద్రం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ద్వారా తెలిపింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దీనికి ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. పర్యావరణ అనుకూల విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు స్క్రాపేజీ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా మోటార్‌ వాహనాల చట్టానికి సవరణలను 2019లో ప్రభుత్వం ప్రతిపాదించింది. కాలానుగుణంగా కొత్త టెక్నాలజీతో రకరకాలైన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాలుష్యరహితమైన వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వాటికి రూట్‌ క్లియర్‌ చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది.

మరోవైపు పాత వాహనాలను స్క్రాప్‌ కింద అమ్మితే, వాటిని ఆటోమొబైల్‌ కంపెనీలు కొనుగోలు చేసి, ఆ ముడిసరుకు ద్వారా కొత్త వాహనాలు తయారు చేసేందుకు వీలవు తుందని, దాని వల్ల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు గడ్కరీ.
అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి స్క్రాప్‌ వాహనాలను తీసుకుని, దాని ద్వారా రీసైకిల్‌ చేసిన వాహనాలు తయారు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. దీని వల్ల కంపెనీల మీద కూడా ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. దేశంలో ఆటోమొబైల్‌ రంగం విలువ 4.5 లక్షల కోట్ల రూపాయలు. అందులో 1.5 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు ఉన్నాయని చెప్పారు.

Also Read: మళ్ళీ రాజకీయాల వైపు చూస్తున్న మెగాస్టార్ .. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా అన్న చిరంజీవి …