అమెరికాలోని న్యూజెర్సీ నగరం మంగళవారం కాల్పులతో దద్దరిల్లింది. ఇద్దరు దుండగులు సుమారు గంట సేపు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. యూదుల (జెవిష్) గ్రాసరీ స్టోర్ (మాల్) ని లక్ష్యంగా చేసుకుని వారు కాల్పులు జరపగా.. వారిపై పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి, ఇద్దరు అనుమానితులతో సహా ఆరుగురు మరణించారు. నగరంలోని బే వ్యూ సిమెటరీ వద్ద ఈ కాల్పుల మోత ప్రారంభమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా.. దుండగులు జరిపిన ఫైరింగ్ లో సిటీ పోలీస్ డిటెక్టివ్ చీఫ్ 39 ఏళ్ళ జోసెఫ్ ‘ జో ‘ సీల్స్ ప్రాణాలు కోల్పోయాడు. నల్లని దుస్తులు ధరించిన క్రిమినల్స్ అత్యంత అధునాతన రైఫిళ్ళతో కాల్పులు జరిపినట్టు తెలిసింది.