అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్​బుక్ కీలక నిర్ణయం !

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఫేస్​బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.  వైరల్ కంటెంట్​ను నియంత్రించేందుకు ఫేస్​బుక్ అత్యవసర యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

  • Ram Naramaneni
  • Publish Date - 4:33 pm, Mon, 26 October 20
అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్​బుక్ కీలక నిర్ణయం !

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఫేస్​బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.  వైరల్ కంటెంట్​ను నియంత్రించేందుకు ఫేస్​బుక్ అత్యవసర యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సమాచార విశ్వసనీయతను తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ వాల్​ స్ట్రీట్ జర్నల్​ కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల సమయంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు ఫేస్​బుక్ ఈ వ్యవస్థ ద్వారా ప్రయత్నిస్తోందని ఈ కథనంలో పేర్కొంది.

‘సురక్షితమైన ఎలక్షన్స్  కోసం మేము ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాం. గత ఎన్నికల నుంచి నేర్చుకున్న పాఠాల నుంచి ఇప్పుడు కొత్త పద్దతులు అనుసరించిబోతున్నాం. ఎక్స్పపర్ట్స్‌ను నియమించుకున్నాం. కొత్త టీమ్స్ ఏర్పాటు చేశాం.’ అని ఓ ఫేస్​బుక్​ అధికారి తెలిపినట్లు వాల్​స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఫేస్​బుక్​ తీసుకొస్తున్న ఈ చర్యలు వైరల్​ కంటెంట్​ తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల కోసం రూపొందించినవి  అని వాల్ల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మయన్మార్, శ్రీలంకల్లో వీటిని ఇప్పటికే వినియోగించారని… వైరల్ కంటెంట్​ను నిరోధించేందుకు, విశ్వసనీయ సమాచారం గుర్తింపునకు ఫేస్​బుక్​ నూతన చర్యలు ఉపయోగపడతాయని అభిప్రాయపడింది.

Also Read : కొత్త జాతీయ రహదారి: హైదరాబాద్- తిరుపతి మధ్య తగ్గనున్న 80కి.మీ దూరం