టాప్ 10 న్యూస్ @ 6PM

| Edited By:

Sep 10, 2019 | 5:57 PM

1.బాబు బుజ్జగించినా వినలేదు.. రేపు బీజేపీలోకి మాజీ మంత్రి ఏపీలో టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని కీలక వ్యక్తులందరూ టీడీపీని వీడగా.. తాజాగా మరో మాజీ మంత్రి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి…Read more 2.అన్నీ చిల్లర రాజకీయాలే ! కాంగ్రెస్ పై ఫైర్ ! ఊర్మిళ గుడ్ బై ! లోక్ సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో తమ పార్టీ […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us on

1.బాబు బుజ్జగించినా వినలేదు.. రేపు బీజేపీలోకి మాజీ మంత్రి

ఏపీలో టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని కీలక వ్యక్తులందరూ టీడీపీని వీడగా.. తాజాగా మరో మాజీ మంత్రి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి…Read more

2.అన్నీ చిల్లర రాజకీయాలే ! కాంగ్రెస్ పై ఫైర్ ! ఊర్మిళ గుడ్ బై !

లోక్ సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ గా భావించి టికెట్ కూడా ఇఛ్చిన కాంగ్రెస్ పార్టీని బాలీవుడ్ నటి, ఈ పార్టీ నేత ఊర్మిళా మటోండ్కర్ వీడారు. అయిదు నెలల పాటు కాంగ్రెస్ లో సాగిన ఈమె మంగళవారం పార్టీకి గుడ్ బై చెప్పారు…Read more

3.పల్నాడులో 144 సెక్షన్ విధించాం: డీజీపీ

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పల్నాడులో అన్ని చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుతం 144, 30 సెక్షన్లు విధించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అక్కడ ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనకు అనుమతిని ఇవ్వబోమని గౌతమ్ చెప్పుకొచ్చారు…Read more

4.మిస్టర్ కూల్ పేరు మిస్…

గులాబీ దళంలో పదవుల పందేరం మొదలైంది. పదవుల కోసం పెద్ద క్యూ వెయిటింగ్ లో ఉంది. దాంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిగిన సభా కమిటీలను నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ బడ్జెట్ సమావేశంలోనే కమిటీ చైర్మన్ లను, సభ్యులను…Read more

5.ఐఎన్ఎక్స్ కేసులో ఇంద్రాణీని ప్రశ్నించనున్న సీబీఐ

దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ముఖర్జియాను సీబీఐ మంగళవారం విచారించనుంది. మరికాసేపట్లో ముంబై బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమెను సీబీఐ విచారించనున్నట్టు…Read more

6.రెచ్చిపోయిన గజరాజులు..17 మందికి గాయాలు.. అసలేమైంది ?

శ్రీలంకలో ఓ మతపరమైన ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో రెండు ఏనుగులను ఘనంగా అలంకరించి నిర్వాహకులు తీసుకువచ్చారు. సాధారణంగా గజరాజులు ఇలాంటి సెలబ్రేషన్స్ లో నిబ్బరంగా పాల్గొంటాయి…Read more

7.విక్రమ్ ఆచూకీ కోసం.. నాగ్‌పూర్ పోలీసుల ‘తాయిలం’

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ ఇంకా చంద్రుడిపై ల్యాండ్ అవ్వలేదు. చందమామకు 2.1కి.మీల దూరంలో ఉన్న సమయం నుంచి ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి…Read more

8.భారీ నష్టాల్లో పేటీఎం… రోజుకు రూ.11 కోట్ల నష్టం!

పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి గతంలో కంటే మూడు రెట్ల నష్టాన్ని చవి చూసింది. పేటీఎం బ్రాండ్ నిర్మాణం కోసం, వ్యాపార విస్తరణ కోసం భారీ ఎత్తున ఖర్చు చేసింది. ముగిసిన గత ఆర్థిక…Read more

9.అరుదైన రికార్డుకు అతి చేరువలో… ‘యాక్సిడెంటల్ కెప్టెన్’!

ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో ఆసీస్ ఇప్పటికే ఇంగ్లాండ్‌పై 2-1 ఆధిక్యంలో ఉంది. గురువారం ఓవల్‌లో జరిగే చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోకుంటే ఇంగ్లాండ్‌లో సుదీర్ఘకాలం…Read more

10.కన్నీటి కడలిలో ‘బిగ్ బాస్’… కన్ఫ్యూషన్‌లో కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ మూడో సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లోనే అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరున్న అలీ రెజా.. ఊహించని రీతిలో ఎలిమినేట్ కావడంతో షో టైటిల్ ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇకపోతే అలీ రెజా ఇంటి నుంచి…Read more